Saturday, October 5, 2024

రేపు బిజెపి 24 గంటల రైతు దీక్ష

- Advertisement -
- Advertisement -

రైతు హామీల సాధన దీక్ష చేపడుతున్నట్లు బిజెఎల్పీ నేత ఏలేటి మహేశ్వర రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఒక ప్రకటన జారీ చేశారు. రైతులకు ఇచ్చిన హామీలను రాష్ట్ర ప్రభుత్వం విస్మరించిందని, ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ నెల 30 ఉదయం నుంచి అక్టోబరు 01 ఉదయం వరకు 24 గంటల పాటు హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు ధర్నా చౌక్ వద్ద రైతు హామీల సాధన దీక్ష చేస్తున్నట్లు తెలిపారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ దీక్ష చేస్తున్నామని ఆయన వెల్లడించారు. అన్నం పెట్టే అన్నదాతలకు అండగా నిలవాలని, రైతు దీక్షను జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సాధన దీక్షలో ఎమ్మెల్యేలు, ఎంపిలు, కేంద్రమంత్రులు, పార్టీ పదాధికారులు, ముఖ్య నాయకులు పాల్గొంటారని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News