Tuesday, March 5, 2024

జర్నలిస్టులపై బిజెపి దాడి హేయమైన చర్య

- Advertisement -
- Advertisement -

నర్సంపేట: జర్నలిస్టు తులసి చందుపై బిజెపి దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని బీఎస్పీ రాష్ట్ర నాయకుడు బొట్ల కార్తీక్ అన్నారు. బుధవారం నర్సంపేటలోని ఆర్‌అండ్‌బీ అతిథిగృహంలో బీఎస్పీ నర్సంపేట నియోజకవర్గ అధ్యక్షుడు డ్యాగల శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సమావేశంలో ముఖ్యఅతిథిగా బీఎస్పీ రాష్ట్ర నాయకుడు బొట్ల కార్తీక్ పాల్గొని మాట్లాడుతూ.. దేశాన్ని దోచుకుంటున్న బిజెపి చేస్తున్న అరాచకాలు, అన్యాయాలు, దోపిడీని ఉన్నది ఉన్నట్లుగా ప్రజలకు చెపుతున్న జర్నలిస్టు తులసి చందుపై బిజెపి దాడి చేయడం హేయమైన చర్య అన్నారు.

దాడిన బిజెపి పార్టీకి తగిన బుద్ధి చెప్పాలన్నారు. దేశాన్ని ఆదాని కుటుంబానికి అమ్ముతున్న నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని బిజెపి ప్రభుత్వంతో చీకటి ఒప్పందం కుదుర్చుకున్న బీఆర్‌ఎస్ కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించడానికి 93 శాతం ఉన్న బహుజనులు సిద్ధం కావాలన్నారు. ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా అధ్యక్షుడు మంద శ్యామ్, జిల్లా ప్రధాన కార్యదర్శి మాసాని రమేశ్, భూపాలపల్లి నియోజకవర్గ నాయకుడు అల్లూరి శ్రీకాంత్, నర్సంపేట మండల కన్వీనర్లు తనుగుల శ్రీకాంత్, బస్కే అవోక్, రాజేందర్, సందీప్, ప్రభు, కిరణ్, సందీప్, మల్లేశ్, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News