Wednesday, April 17, 2024

రాష్ట్రంలో బిజెపికి ఆదరణ పెరుగుతుంది: కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో బిజెపికి ఆదరణ పెరుగుతుందని దీంతో ఇతర పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పార్టీలో చేరుతున్నారని చేవెళ్ల ఎంపి అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు. సోమవారం రాష్ట్ర పార్టీ కార్యాలయంలో అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఆధ్వర్యంలో యాలాల్ ఎంపి తాళ్లపల్లి బాలేశ్వర్ గుప్తాతో పాటు పలువురు సర్పంచులు, సీనియర్ నాయకులు చేరినట్లు తెలిపారు. నియోజకవర్గంలో ఇప్పటికే మొదటి విడుత ప్రచారం పూర్తి చేశామని, ప్రజల నుంచి అనుహ్యమైన స్పందన వస్తుందని హర్షం వ్యక్తం చేశారు. త్వరలో జరిగే ఎన్నికల్లో చేవెళ్ల పార్లమెంటు సీటులో బిజెపి విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News