Sunday, July 14, 2024

మంత్రాలు చేస్తున్నాడని పెద్దనాన్నను నరికిచంపిన కుమారుడు

- Advertisement -
- Advertisement -

భువనేశ్వర్: మంత్రాలు చేస్తున్నారనే నేపంతో పెద్దనాన్నను తమ్ముడి కుమారుడు గొడ్డలితో నరికి చంపిన సంఘటన ఒడిశా కళహండి జిల్లా భవానిపట్న పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… సికేర్‌గుడా గ్రామంలో 65 ఏళ్ల వృద్ధుడు తన తమ్ముడి కుటుంబంపై మంత్రాలు చేస్తుండడంతో వారు అనారోగ్యం పాలవుతున్నారని అనుమానాలు పెంచుకున్నారు. 65 ఏళ్ల వృద్ధుడు తన పొలంలో పనులు చేసుకుంటుండగా తమ్ముడి కుమారుడు అతడిని గొడ్డలిలో నరికిపారిపోయాడు. గ్రామస్థుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read: గ్రామ స్వరాజ్యానికి తెలంగాణ పల్లెలే ప్రతి రూపాలు: కెసిఆర్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News