- Advertisement -
మేడిపల్లి: మేడ్చల్ జిల్లా పరిధి బాలాజీ హిల్స్ లో దారుణం జరిగింది. గర్భవతి అయిన భార్యను చంపి ముక్కలు ముక్కలు చేశాడు. తదుపరి శరీర భాగాలను కవర్లో వేసి బయటకు తీసుకెళ్లి పడేసేందుకు సిద్ధమయ్యాడు. గది నుంచి శబ్దాలు రావండంతో ఇరుగింటి వ్యక్తులు వెళ్లి చూడటంతో విషయం బయటకు వచ్చింది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు నిందితుడు మహేందర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. ప్రేమ వివాహం చేసుకుని బోడుప్పల్ లో స్వాతి, మహేందర్ ఉంటున్నారు. దంపతులు వికారాబాద్ జిల్లా కామారెడ్డిగూడ వాసులుగా గుర్తించారు. ఈ హత్యకు గల కారణాలపై మేడిపల్లి పోలీసులు ఆరా తీస్తున్నారు.
- Advertisement -