Sunday, December 15, 2024

రోడ్డు ప్రమాదంలో డైరెక్టర్ కొడుకు మృతి..

- Advertisement -
- Advertisement -

బాలీవుడ్ లో విషాద సంఘటన చోటుచేసుకుంది. ‘సన్ ఆఫ్ సర్దార్’ మూవీ డైరెక్టర్ డైరెక్టర్ అశ్వినీ ధిర్ కుమారుడు జలజ్ ధిర్(18) రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. ఫ్రెండ్స్‌తో కలిసి సరదాగా ముంబై రోడ్లపై రైడ్ కి వెళ్లిన జలజ్..తన కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టితో తీవ్రంగా గాయపడ్డాడు.దీంతో ఘటనాస్థలంలోనే అతను ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం.

ఈ ప్రమాదంలో జలజ్ తోపాటు తీవ్రంగా గాయపడిన అతడి ఫ్రెండ్ కౌశిక్ కూడా మృతి చెందినట్లు తెలుస్తోంది. ప్రమాద సమయంలో జలజ్ మరో ఫ్రెండ్ సాహిల్ మద్యం సేవించి కారు నడిపినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, కొడుకు మరణించడంతో డైరెక్టర్ అశ్వినీ ధీర్ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News