Home అంతర్జాతీయ వార్తలు పాకిస్తాన్‌లో బాంబు పేలుళ్లు: 16 మంది మృతి

పాకిస్తాన్‌లో బాంబు పేలుళ్లు: 16 మంది మృతి

Pakistan1పెషావర్: పాకిస్తాన్‌లోని మహ్మద్ ట్రైబల్ జిల్లాలో శుక్రవారం ఆత్మాహుతి దాడులు జరిగాయి. ఈ దాడుల్లో 16 మంది మృతి చెందగా, 35 మంది తీవ్రంగా గాయపడ్డారు. మధ్యాహ్నం ప్రార్థనలు నిర్వహిస్తున్న సమయంలో ఓ దుండగుడు మసీదులోకి చొరబడి తనను తాను పేల్చుకున్నాడు. స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.