Tuesday, November 12, 2024

మూడు రోజులు.. 15 బెదిరింపు కాల్స్

- Advertisement -
- Advertisement -

బాంబు పెట్టాం.. పేల్చిపారేస్తాం.. దమ్ముంటే కాపాడుకోండి..! అంటూ ఒక అజ్ఞాతవాసి నుంచి బెదిరింపు స్వరం. తీరా చూస్తే అంతా తూచ్. ఇదీ వరస. ఇంటర్నేషనల్, డొమెస్టిక్ ఫ్లైట్లన్న తేడా లేదు. ఉత్తుత్తి బెదిరింపులతో వేలాదిమంది ప్యాసింజర్లు బెంబేలెత్తి పోయారు. ప్రాణాలు గుప్పిట పట్టి ప్రయాణించాల్సిన పరిస్థితి. అటు ఏవియేషన్ యంత్రాంగానిక్కూడా చుక్కలు కనిపించాయి .గత మూడు రోజుల్లోనే మొత్తం 15 బాంబ్ థ్రెట్స్ నమోదయ్యాయి. అక్టోబర్ 16, బుధవారం.. ఈ ఒక్కరోజులోనే ఆరు విమానాలకు బాంబు బెదిరింపులొచ్చాయి. కాకపోతే అన్నీ ఫేకే..! అందరూ క్షేమం. మూడు ఇండిగో, రెండు స్పైస్‌జెట్.. ఒకటి ఆకాశ ఎయిర్.. మొత్తం ఆరు ప్లేన్లలో ప్రయాణికుల్ని బెంబేలెత్తించాయి బోగస్ ఫోన్ కాల్స్.ఢిల్లీ నుంచి చికాగో వెళ్లాల్సిన ఎయిరిండియా విమానం.. అగంతకుల బెదిరింపు కారణంగా దారిమళ్లించాల్సి వచ్చింది. సీక్రెట్‌గా ఒక రిమోట్ ఎయిర్‌పోర్ట్‌లో దింపి అందులోని 200 మంది ప్రయాణికుల్ని కాపాడారు.

వీళ్లను ఎయిర్‌లిఫ్ట్ చేయడం కోసం.. రాయల్ కెనడియన్ ఎయిర్‌ఫోర్స్‌కి చెందిన సిసి-330 యుద్ధ విమానాన్ని వాడారు. ఇటీవలే తిరుపతి విమానాశ్రయానికే బెదిరింపులేఖ వచ్చింది. ఈ -మెయిల్ ద్వారా సిఐఎస్‌ఎఫ్ అధికార వెబ్‌సైట్‌కు పంపిన లేఖను గోప్యంగా ఉంచింది ఎయిర్‌పోర్టు అథారిటీ. పోలీసులకు ఫిర్యాదు చేసి, ఈ-మెయిల్ ఆధారంగా నిందితుడ్ని పట్టుకునే ప్రయత్నం జరుగుతోంది. ఒకవైపు ప్యాసింజర్లకు అసౌకర్యం.. మరోవైపు ఫ్లయిట్ షెడ్యూల్స్ మార్చాల్సి రావడం..! ఫేక్ కాల్స్‌తో ఈ హైరానా పడలేకున్నాం అంటూ ప్రైవేట్ ఎయిర్‌లైన్ సంస్థల నుంచి కేంద్ర ప్రభుత్వంపై వత్తిడి పెరుగుతోంది. అందుకే మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ప్లస్ హోమ్ మినిస్ట్రీ కలిసి కూర్చుని హైలెవల్ మీటింగ్ పెట్టుకుని వాట్‌టు డూ వాట్ నాట్ టూడూ అని చర్చించాయి. అగంతకుల్ని పసిగట్టి వాళ్లపై కఠినమైన చర్యలు తీసుకోవాలని డిసైడయ్యాయి. ఫేక్ గాళ్లందరికీ అడ్డా సోషల్ మీడియానే. ఎక్కువగా ట్వీట్ల ద్వారానే అగంతకులు ఓవరాక్షన్‌కు పాల్పడుతున్నట్టు తేలింది.

వీలైతే వీళ్లను మళ్లీ విమానమెక్కనివ్వకుండా నో-ఫ్లై లిస్టులో చేర్చాలని, ఆర్థికంగా నష్టపోయిన విమానయాన సంస్థలకు వాళ్లతోనే పరిహారం ఇప్పించాలని ఐదేళ్ల జైలు శిక్ష వేయాలని ప్రపోజల్స్ వస్తున్నాయి. ఎయిర్‌క్రాఫ్ట్ చట్టం, 1934 సబార్డినేట్ చట్టాలకు సవరణలు చేసేందుకు కేంద్రంలోని ఉన్నత అధికార వర్గాలు తెలిపాయి. దీనికి సంబంధించి న్యాయనిపుణులతో మాట్లాడి లీగల్ ఒపీనియన్ తీసుకుంటోంది కేంద్ర సర్కార్. అటు.. వరుస బెదిరింపుల వెనక ఏదైనా విదేశీ హస్తం ఉందా? అనే అనుమానాల్ని పరిశీలిస్తోంది కేంద్ర ప్రభుత్వం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News