Tuesday, December 3, 2024

కొత్త పుస్తకం

- Advertisement -
- Advertisement -

ఆహా ఏ మద్భుతమది?
అంతెత్తున అంబరాన
అన్ని కిలోమీటర్లలో
వారధెటుల వెలయించిరి?
రోడ్డునేమి కుంచింపక
మేఘాలలో రైళ్లు తిరుగు
మార్గమెలా రూపొందెను?
అంటూ లోకం ముక్కు మీద వేలు పెట్టుకుని విస్తుపోయే విధంగా నిర్మించిన ‘మేఘపథం’ నిర్మాణ విశేషాలను, ఎదురైన ఆటంకాలు, అడ్డకులూ, అవాంతరాలను, అధిగమించిన సాహసోపేతమైన అనుభవాలను చక్కని కవితా ఖండికల ద్వారా రికార్డు చేయడం సముచితంగా వుంది. మెట్రోలో హాయిగా ప్రయాణం చేస్తూ త్వరితగతిన గమ్యస్థానాలకు చేరుకుంటున్న ప్రయాణికుల సౌకర్యం వెనుక ఇంత చరిత్ర వుందా? అన్న విషయాన్ని ఈ కవితాఝరి ద్వారా చదివిన పాఠకుడు ఒక వేడి నిట్టూర్పు విడుస్తాడు. ఒక విజేత అనుభవ గాథను చదివి స్ఫూర్తిని పొందుతాడు. హైదరాబాద్ మహానగర మెట్రో నిర్మాణ గాథను భావితరాలు తెలుసుకునే విధంగా అక్షరమయం చేసిన ఎన్‌విఎస్ రెడ్డి గారికి హృదయపూర్వక అభినందనలు. ఇదొక కేస్ స్టడీ. ఇదొక అద్భుత కవితాఝరి.

-ఎస్‌వి సత్యనారాయణ
పుస్తక పరిచయ సభ
హైదరాబాద్ మెట్రో రైల్ ఎండి
శ్రీ ఎన్‌విఎస్ రెడ్డి గారి ‘మేఘపథం’ మెట్రో కవితాఝరి పుస్తక పరిచయ సభ 2022 డిసెంబర్ 25, ఆదివారం సాయంత్రం 6 గంటలకు అంతర్జాల వేదికలో… జరుగుతుంది.

‘మేఘపథం’
ఎన్‌విఎస్ రెడ్డి
మూల్యం : రూ. 500/

ప్రతుల కోసం:
ఎమెస్కో బుక్స్ ప్రై.లి.
127, బానూ కాలనీ,
గగన్‌మహల్ రోడ్, దోమల్‌గూడ
హైదరాబాద్ 500029

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News