Thursday, April 25, 2024

కాజీపేటలో విషాద ఘటన..

- Advertisement -
- Advertisement -

కాజీపేట: కుక్కల దాడిలో మరో బాలుడు మృతి చెందిన సంఘటన వరంగల్ జిల్లా కాజీపేటలో శుక్రవారం చోటుచేసుకుంది. కాజీపేట పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం… ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం, వారనాసీ (బెనరాస్)కు చెందిన మలహర్ సింగ్-, సునీత దంపతులకు ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు. సంచార జాతికి చెందిన ఈ కుటుంబాలు రోడ్లపై చేతివేళ్ల రింగులు, చిన్నచిన్న వస్తువులు అమ్ముకుని జీవనం సాగిస్తారు. మూడు సంచార జాతి కుంటుంబాలు అజ్మీర్ వెళ్లేందుకు రైలు లేకపోవడంతో గురువారం రాత్రి కాజీపేట రైల్వే చిల్డ్రన్స్ పార్కు ప్రహరీ గోడ పక్కన చెట్ల కింద సేద తీరారు. శుక్రవారం ఉదయం ఆ కుటుంబాలకు చెందిన కొందరు పట్టణంలో కూరగాయలు తెచ్చుకునేందుకు వెళ్లారు.

Also Read: 36 లక్షల మొబైల్ నెంబర్లు కట్

మలహార్ సింగ్ కుమారుడు చోటు (7) పార్కు సమీపంలో బహిర్భూమికి వెళ్లడంతో వీధి కుక్కల గుంపు పది నిమిషాలపాటు దాడి చేశాయి. దీంతో అటుగా వెళుతున్న స్థానికులు కుక్కల తరిమికొట్టారు. అనంతరం బాలుడిని పరిశీలించగా అప్పటికే మరణించాడు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతి చెందిన చోటును, కుటుంబ సభ్యులను పోలీస్ వాహనంలో ఎంజీఎం దవాఖానాకు తరలించారు. అయితే బాలుడి మృతదేహం వద్ద కుటుంబ సభ్యులతోపాటు బాలుడి సోదరి అన్న లే అని వెక్కివెక్కి ఏడుస్తున్న తీరు అక్కడ వారిని కంటతడి పెట్టించింది

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News