ఆసియాకప్-2025 కోసం ప్రకటించిన భారత జట్టు ఎంపిక విషయంలో సర్వత్ర విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా శ్రేయస్ అయ్యర్‌ని (Shreyas Iyer) జట్టులో కాదు కదా.. కనీసం స్టాండ్ బై ప్లేయర్‌గా కూడా తీసుకుపోవడంతో సెలక్టర్లపై అభిమానులు, పలువురు సీనియర్లు మండిపడుతున్నారు. శ్రేయస్ గత కొంతకాలంగా ఫార్మాట్‌తో సంబంధం లేకుండా అద్భుత ప్రదర్శన చేస్తున్నాడు. ఈ ఏడాది ఐపిఎల్‌లోనూ అతను రాణించాడు. పంజాబ్ జట్టును ఫైనల్స్‌కి తీసుకుపోవడమే కాకుండా.. 600+ పరుగులు సాధించాడు. అయినా కూడా అతడిని సెలక్టర్లు పక్కన పెట్టడాన్ని ఆసీస్ మాజీ వికెట్ కీపర్, పంజాబ్ జట్టు అసిస్టెంట్ కోచ్ బ్రాడ్ హాడిన్ తప్పుబట్టారు.
శ్రేయస్‌ని (Shreyas Iyer) ఎంపిక చేయకపోవడం ఓ వింత నిర్ణయమని పేర్కొన్నారు. శ్రేయస్ ఒక ఆల్ ఫార్మాట్ ప్లేయర్ అని.. అతన్ని ఎందుకు ఎంపిక చేయలేదో అర్థం కావడం లేదని అన్నారు. ‘‘శ్రేయస్‌కి గొప్ప నాయకత్వ లక్షణాలు ఉన్నాయి. తీవ్రమైన ఒత్తిడిలో కూడా నిలకడగా బ్యాటింగ్ చేసే సత్తా ఉంది. అతడు ఆడే స్టైల్ వేరు. మిడిలార్డర్లో అతడిని మించిన బ్యాటర్ మరొకరు లేరు. అతని పేరు జట్టులో లేకపోవడం చూసి.. తొలుత అతడిని గాయమైందని అనుకున్నా.. కానీ, కావాలనే తప్పించారని తర్వాత తెలిసింది. శ్రేయస్ ఒక మంచి టీమ్ మ్యాన్.. అతడు కెప్టెన్ కావాల్సిన వాడు. కానీ, జట్టులోనే చోటు దక్కకపోవడం కరెక్ట్ కాదు’’ అని ఓ పాడ్‌కాస్ట్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో హాడిన్ పేర్కొన్నారు.
Also Read : సఫారీలకు సిరీస్