Wednesday, April 17, 2024

హీరో అజిత్ కు బ్రెయిన్ సర్జరీ?

- Advertisement -
- Advertisement -

చెన్నై అపోలో ఆస్పత్రిలో హీరో అజిత్ కు బ్రెయిన్ సర్జరీ జరిగినట్లు వదంతులు వెలువడుతున్నాయి. అజిత్ బుధవారం ఆస్పత్రిలో చేరారు. ఇది తెలిసిన అభిమానులు ఎంతో ఆందోళన చెందారు. అయితే రొటీన్ హెల్త్ చెకప్ కోసమే అజిత్ ఆస్పత్రిలో చేరినట్లు ఆయన సన్నిహితవర్గాలు చెప్పడంతో అభిమానులు ఊరట చెందారు. కానీ, అజిత్ మెదడులో కణితి ఉన్నట్లు కొంత కాలం క్రితం వైద్యపరీక్షల్లో తేలిందనీ, డాక్టర్లు నాలుగు గంటలపాటు శ్రమించి, అజిత్ తలలో ఉన్న కణితిని తొలగించారని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.

అయితే ఇందులో నిజం లేదని అజిత్ సోషల్ మీడియా పిఆర్ మేనేజర్ సురేశ్ చంద్ర స్పష్టం చేశారు. అజిత్ చెవికింద ఉన్న ఒక నరం బలహీనంగా ఉన్నట్లు వైద్య పరీక్షల్లో తేలిందనీ, డాక్టర్లు అరగంటసేపు చికిత్స చేసి, చెవి నరాన్ని బాగు చేశారని ఆయన చెప్పారు. అజిత్ జనరల్ వార్డులో విశ్రాంతి తీసుకుంటున్నారనీ, శుక్రవారం రాత్రిగాని, శనివారం ఉదయం గానీ అజిత్ డిశ్చార్జి అయ్యే అవకాశాలు ఉన్నాయని సురేశ్ చంద్ర ట్వీట్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News