Sunday, July 6, 2025

నీటిగుంతలో పడి అక్కాతమ్ముడు మృతి

- Advertisement -
- Advertisement -

నీటి గుంతలో ప్రమాదవశాత్తు పడి అక్కాతమ్ముడు మృతి చెందిన ఘటన శనివారం ఆదిలాబాద్ జిల్లా, మావల మండలంలో చోటుచేసుకుంది. మావల పరిధిలోని గ్రీన్ సిటీ సమీపంలో సైకిల్‌పై వెళ్తున్న అక్క వినూత్న (11), తమ్ముడు విధాత (9) ప్రమాదవశాత్తు కుంటలో పడిపోయారు. స్థానికులు గమనించేలోపే వారు మృతి చెందారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను బయటకు. తీసి రిమ్స్ మార్చురీకి తరలించారు. ఒకే కుటుంబానికి ఇద్దరు చిన్నారులు మృతి చెందడంతో విషాదఛాయాలు అలుముకున్నాయి. మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News