Tuesday, November 28, 2023

ఇద్దరి పై కత్తులతో దాడి..

- Advertisement -
- Advertisement -

మల్యాలః ముగ్గురు వ్యక్తులు ఇద్దరిపై కత్తులతో దాడి చేసిన సంఘటన బుధవారం నాడు మల్యాల మండలంలోని బల్వంతాపూర గ్రామంలో చోటు చేసుకుంది. వివరాలలోకి వెళితే.. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. బల్వంతాపూర గ్రామానికి చెందిన  దస్తగిరి గ్రామ రెవెన్యూ సహాయకులుగా పనిచేస్తున్నాడు.బుధవారం నాడు దస్తగిరి, అతని సోదరుడు మౌలానాపై ముగ్గురు వ్యక్తులు అదే గ్రామంలో ద్విచక్ర వాహనంపై వెంబడించి కత్తులతో దాడి చేశారు. ఈ ఘటనలో ఇద్దరు అన్నదమ్ములు తీవ్రంగా గాయపడ్డారు.

స్థానికులు గాయపడిన  దస్తగిరి, అతని తమ్ముడు మౌలానాను జగిత్యాల ఏరియా ఆస్పత్రికి తరలించారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు విచారణ చేశారు. ద్విచక్ర వాహనంపై వచ్చిన ముగ్గురు వ్యక్తుల్లో ఒకరు బల్వంతాపూర్ గ్రామానికి చెందిన హరీష్‌గా గుర్తించగా స్థానికులు గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. మరో ఇద్దరు వ్యక్తులను గుర్తించేందుకు పోలీస్ శాఖ చర్యలు చేపట్టినట్లు ఎస్‌ఐ తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం వెతుకుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News