Saturday, May 3, 2025

కాపురంలో చిచ్చుపెట్టిన గడ్డం… మరిదితో పారిపోయిన వదిన

- Advertisement -
- Advertisement -

లక్నో: భర్త గడ్డం తీయలేదని షేవ్ చేసుకొని నీట్‌గా కనిపించే మరిదితో వదిన పారిపోయింది. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం మేరఠ్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. లిసాడి గేట్ ప్రాంతంలో మౌలానా షకీర్ అనే యువకుడు అర్షిని ఆరు నెలల క్రితం వివాహం చేసుకున్నాడు. అత్తగారింట్లోనే ఉంటూ 12వ తరగతి చదువుతోంది. తొలి రాత్రి భర్త గడ్డం గురించి భార్య అభ్యంతరం వ్యక్తం చేసింది. గడ్డం తీస్తేనే కాపురం చేస్తానని భర్తకు చెప్పింది. గడ్డం తీసే ప్రసక్తే లేదని భర్త ఖరాఖండీగా చెప్పాడు. గడ్డం విషయంలో దంపతుల గొడవలు జరుగుతున్నాయి. మౌలానా పనికి వెళ్తుండడంతో ఇంట్లో అత్తా, మరిది ఉండేవారు. మరిది క్లీన్‌గా షేవ్ చేసుకొని కనిపించడంతో ఇద్దరు మధ్య సానిహిత్యం పెరిగింది. దీంతో మరిదితో కలిసి భార్య పారిపోవడంతో స్థానిక పోలీస్ స్టేషన్‌లో భర్త ఫిర్యాదు చేశాడు. షకీర్ ఫిర్యాదుతో ఇద్దరు తప్పిపోయినట్లుగా పోలీసులు కేసు నమోదు చేస దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News