Saturday, April 13, 2024

బిఆర్ఎస్ కార్యకర్తలు సైనికులు.. ఎవరికి భయపడరు..

- Advertisement -
- Advertisement -

లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో మల్కాజ్‌గిరి బిఆర్ఎస్ ఎంపి అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి, మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి, మేయర్ జక్కా వెంకట్ రెడ్డి పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కార్పొరేటర్లు, నాయకులు, పార్టీ శ్రేణులతో శుక్రవారం సమావేశమయ్యారు.  ఈ సందర్భంగా బిఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి మాట్లాడుతూ.. దేశంలోనే తెలంగాణను నెంబర్ వన్‌గా నిలిపిన ఘనత కేసీఆర్‌ది.. అభివృద్ధి బిఆర్ఎస్‌తోనే సాధ్యం అవుతుందని మల్లారెడ్డి స్పష్టం చేశారు.

ఢిల్లీ పార్టీలను వదిలి.. తెలంగాణ ప్రజల పార్టీ బీఆర్ఎస్‌కు అండగా ఉండాలని పిలుపునిచ్చారు. బిఆర్ఎస్ కార్యకర్తలు సైనికులు ఎవరికి భయపడరన్న మాజీ మంత్రి కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచి 100 రోజులైనా ప్రజలకు ఇచ్చిన హామీలలో నేరవేర్చించింది శూన్యం అని ఎద్దేవా చేశారు. మల్కాజ్‌గిరి పార్లమెంట్ బిఆర్ఎస్ పార్టీ ఎంపి అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న రాగిడి లక్ష్మారెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని పార్టీ నాయకులకు, కార్యకర్తలకు మల్లారెడ్డి దిశానిర్దేశం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News