Tuesday, March 21, 2023

షర్మిల నోరు అదుపులో పెట్టుకో: కవిత

- Advertisement -

మహబూబాబాద్ : ముఖ్యమంత్రి కెసిఆర్ పై వైఎస్ షర్మిల చేసిన వ్యాఖ్యలపై మహబూబాబాద్ ఎంపి మాలోత్ కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. పితృసమానులైన కేసీఆర్ పైన నువ్వు వాడుతున్న బాష ఏంటి..! అని ప్రశ్నించారు. గిల్లికజ్జాలు పెట్టుకోవాలని చూసే నీ..బుద్ది మార్చుకో అన్నారు. తెలంగాణ ప్రజల గుండెచప్పుడు కేసిఆర్… నువ్వు గాలిమాటలు మాట్లాడితే ప్రజలు చూస్తూ ఊరుకోరన్నారు.

BRS MP Maloth Kavitha Counter YS Sharmilaనువ్వు పాదయాత్రలు చేసుకో.. మోకాళ్ళయాత్రలు చేసుకో.. ఇంకా..ఓపికుంటే తెలంగాణ అంతా పొర్లుదండాలయాత్ర చేసుకో కానీ.. నోరుమాత్రం అదుపులో పెట్టుకో అని వార్నింగ్ ఇచ్చారు. పద్దతిమార్చుకోవాలన్నారు. నిందారోపణలు చేస్తూ.. తెలంగాణ సాదించిన మహాత్ముడు కేసీఆర్ పట్ల అనుచితవ్యాక్యలు చేస్తే ప్రజలు తిరుగబడుతారు.. తరిమికొడుతారని సూచించారు. షర్మిళ..నోటిఅదుపు..! మాట పొదుపు.. నీకు.. నీ..ఆరోగ్యానికి మంచిదని కవిత హెచ్చరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News