Saturday, September 21, 2024

రైతుల కోసం పోరాటం చేయడానికి బిఆర్‌ఎస్ సిద్ధం: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రుణమాఫీ కోసం ఆందోళనలు చేస్తున్న రైతులపై కాంగ్రెస్ ప్రభుత్వం కేసులు నమోదు చేస్తుందని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ మండిపడ్డారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రుణమాఫీ జరగలేదని కాంగ్రెస్ మంత్రులే చెబుతుండడంతో వాళ్లకే సమన్వయం లేదని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రివర్గం చేస్తున్న మోసానికి వ్యతిరేకంగా రేపు బిఆర్‌ఎస్ ఆధ్వర్యంలో ధర్నా చేపడుతున్నామని, రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా రేపు తెలంగాణ తల్లికి పాలాభిషేకం చేస్తామని తెలియజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేస్తుందని కెటిఆర్ ధ్వజమెత్తారు. ఎలాంటి ఆంక్షలు లేకుండా రైతులకు రుణమాఫీ ఎప్పటి వరకు చేస్తుందో ప్రభుత్వం చెప్పాలని నిలదీశారు. బిఆర్‌ఎస్ పాలనలో రైతులకు అన్ని విధాలుగా అండగా ఉన్నామని, ఇప్పుడు రైతుల కోసం పోరాటం చేయడానికి బిఆర్‌ఎస్ సిద్ధంగా ఉందని పిలుపునిచ్చారు. కోస్గి మండలంలో 20,239 మంది ఉంటే 8527 మందికి మాత్రమే రుణమాఫీ జరిగిందన్నారు. ఎరుపుమల్లలో యాదగిరి కుటుంబానిని రుణమాఫీ జరగలేదని, ఒకే కుటుంబంలో ఇద్దరు ముగ్గురు ఉంటే ఒకరికి చేస్తామన్నారని, తరువాత ఇతరులకు చేస్తామని చెప్పి రుణమాఫీ ఇంకా ఎందుకు చేయలేదని కెటిఆర్ ప్రశ్నించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News