Saturday, April 20, 2024

ఎన్నికల బరిలో కాలు దువ్వుతున్న పందెం కోళ్లు

- Advertisement -
- Advertisement -

అధికార పార్టీలో ఆశావహులు ఎక్కవ

సమీకరణలు మారితే తప్ప అదృష్టం లేనట్లే

రాజకీయాల్లోకి కొత్తగా డిఎస్‌పి కిషన్, మన్నె జీవన్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, వాకిటి శ్రీధర్, జలందర్ రెడ్డి,అనిరుధ్‌రెడ్డి,
అమ్మకోలు ఎంట్రీలు

ఈ సారి త్రిముఖ పోటీ తప్పదేమో
సీతాదయాక్ రెడ్డి, పయనం ఎటో?

అన్ని పార్టీల్లోనూ వర్గపోరు, పఠిష్టంగా టిఆర్‌ఎస్

మన తెలంగాణ/ మహబూబ్ నగర్ బ్యూరో : అ సెంబ్లీ ఎ న్నికలకు మరో ఎనిమిది నెల లు సమయం ఉండడంతో అన్ని పార్టీల్లో రాజకీయ హడావిడి మొ దలయ్యింది. సంక్రాంతి పండు గ తర్వాత టిఆర్‌ఎస్, బిజెపి, కాంగ్రెస్ పార్టీలు దూకుడు పెంచనున్నాయి. వచ్చే ఎన్నికల్లో త్రిముఖ పోటీ జరిగే అవకాశాలు ఉన్నాయని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. రాజకీయ ఎన్నికల బరి లో కొత్త నేతలు కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని తహతహలాడుతున్నారు. ఎన్నికలకు తా ము సిద్ధ్దంగా ఉన్నామంటూ ఈ పందెం కోళ్లు కాలుదువ్వుతున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి లోగా గెలిచే పందెం కోళ్లు ఎవరు అన్నది మరి కొ ంత కాలం వేచి ఉండాల్సిందే.

మహబూబ్ నగర్, నారాయణ పేట జిల్లాలో ఎన్నికల సమయం దగ్గర పడతున్న కొద్ది కొత్త ముఖాలు తెరమీదికి వస్తున్నా యి. దాదాపు అన్ని పార్టీల్లోనూ వర్గ పోరు తప్పలా లేదని భావిస్తున్నా రు. ముఖ్యంగా అధికార పార్టీ లో ఈ సారి సిట్టింగ్ ఎమ్మెల్యేలకే తిరిగి టికెట్ వస్తు ందని ముఖ్యమంత్రి కెసిఆర్ హామీ ఇవ్వడంతో అధికార పార్టీ ఎమ్మెల్యే లు ధీమాగా ఉన్నారు. ఎన్నికల నోటిఫికేషన్ నాటి కి ఏదైనా సమీకరణలు, మార్పులు జరిగితే తాము కూడా టికెట్ లైన్లో ఉంటామని కొందరు ఆశా వాహులు ఆశలు పెట్టుకున్నారు. ముఖ్యంగా ఈ పోటీ అధికార పార్టీలోనే అధికంగా ఉంది. ఇక బిజెపిలో సైతం కొన్ని నియోజకవర్గాల్లో ఇద్దరు ముగ్గురు నేతలు ఆశలు పెట్టుకున్నారు. ఇక కాం గ్రెస్ పార్టీ పెద్దగా పోటీ లేక పోయినప్పటికీ భలమైన నేతలు లేక పోవడం ఆ పార్టీకి మైనస్‌గా ఉందని భావిస్తున్నారు.

మహబూబ్‌నగర్ నియోజవర్గం:

మహబూబ్‌నగర్ నియోజవర్గంలో మంత్రి శ్రీనివా స్ గౌడ్‌కు వ్యతిరేకంగా టిఆర్‌ఎస్‌లో పోటీ చేయాలనే ఆలోచన కూడా ఎవరికి లేదు. పార్టీపరంగా, అభివృద్ధి పరంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ తన పట్టు ను కాంక్రీట్‌లా వేసుకున్నారు. ఈ నేపథ్యంలో మం త్రి మరో సారీ గెలిచి హ్యాట్రీక్ కొట్టాలని భావిస్తున్నారు. మరో నేత ఎంపి మన్నె శ్రీనివాస్ రెడ్డి అన్న కుమారుడు టిటిడి మెంబర్ మన్నె జీవన్ రెడ్డి రాజకీయ అరంగ్రేటం చేయనున్నారు. అయితే ఏ పార్టీ నుంచి, ఎక్కడ నుంచి పోటీ ఉంటుందని మాత్రం వెల్లడి కావడం లేదు. ఇక బిజెపి నుంచి ఇద్దరు ము ఖ్య నేతలు పోటీ పడుతున్నారు. మంత్రిని ఎదుర్కొనేందుకు సమర్దవంతమైన నాయకుని అన్వేషణలో బిజెపి ఇంకా కసరత్తులు చేస్తోంది. బి జెపినుంచి జాతీయ ఉపాధ్యక్షురాలు డికె అరుణ, మ రో నేత జితేందర్ రె డ్డి ఆశిస్తున్నారు. అ యితే అధిష్టానం మాత్రం డికె అరుణ వైపే మొ గ్గు చూపతున్నట్లు స మాచారం. ఒక వేల ఆమె గద్వాల కు వెళ్తే ఇక్కడ జితేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఎన్నం శ్రీ నివాస్ రెడ్డి బరి లో ఉండే అవకాశాలు ఉన్నాయి. జితేందర్ రెడ్డి కి ఎంపికి నిలబెట్టే అవకాశాలున్నాయి. కాంగ్రెస్ ను ంచి డిసిసి అధ్యక్షులు జిఎంఆర్, సంజీవ్ ముదిరా జ్, న్యాయవాది వినోద్ కుమార్‌లు ఆశిస్తున్నారు.

జడ్చర్ల నియోజకవర్గం..

జడ్చర్ల నుంచి టిఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షులు, ప్రస్తుత ఎమ్మెల్యే లకా్ష్మరెడ్డి ముచ్చటగా మూడో సారి గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని భావిస్తున్నారు. టిఆర్‌ఎస్ నుంచి మరో నేత ఆశలు పెట్టకున్నప్పటికి సిట్టింగ్‌లకు అవకాశం వస్తే ఆయన తప్పుకోనున్నట్లు స మాచారం. దీంతో లకా్ష్మరెడ్డికి లైన్ క్లియర్ కావడ ంతో ఆయనే తిరిగి పోటీ చేసే అవకాశాలు ఉన్నా యి. పార్టీలో సీనియర్ నేతగా మంత్రిగా, సౌమ్యునిగా పేరుంది. బిజెపి నుంచి బాలా త్రిపుర సుందరితో పాటు మరి కొందరు నేతలు ఆశిస్తున్నారు. ఇక్కడ నుంచి బిజెపి సీనియర్ నేత రాష్ట్ర కోశాధికారి శాంతకుమార్ బరిలో ఉండే అవకాశాలు ఉన్నాయి. కాంగ్రెస్ నుంచి మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్, యువనేత అనిరుధ్ రెడ్డి ఆశిస్తున్నారు. అనిరుధ్ రెడ్డికి కాంగ్రెస్‌లో సీనియర్ నేతలతో టచ్‌లో ఉంటున్నారు.

దేవరకద్ర నియోజకవర్గం…

దేవరకద్ర నియోజకవర్గంలో రెండు సార్లు ఘన విజయం సాధించి మూడో విజయం కోసం ఎదు రు చూస్తున్న ప్రస్తుత ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి ఈ సారి మరింత భారీ మెజార్టితో గెలవాలని భావిస్తున్నారు. అందుకు తగ్గట్టు ప్రణాళికలు వేసుకుంటున్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్, మ ంత్రి కెటిఆర్ దగ్గర మంచి సంబంధా లు ఉండడంతో ధీమా గా ఉన్నారు. అభివృద్ధ్ది పరంగా కూడా దేవరకద్ర ను మరో కోనసీమగా మార్చారు. నియోజకవర్గం లో పెద్ద స్థ్దాయిలో ఆయికట్టును సాగులోకి తీసుకొచ్చారు. చెక్ డ్యాంలు నిర్మించి వేలాది ఎకరాలల్లో భూగర్బ జలాలను పెంచుకున్నారు. ఇక బిజెపి నుంచి డోకూరు పవన్ కుమార్ రెడ్డి, మరో బిసి నే త దేవరకద్ర బాలన్న కూడా ఆశిస్తున్నారు. కా్ంర గెస్ నుంచి డిసిసి అధ్యక్షులు జి మధుసూధన్ రెడ్డి, జడ్‌పిటిసి ప్రదీప్ గౌడ్,కొండా ప్రశాంత్ రెడ్డిలు ఆశిస్తున్నారు. ఇదిలా ఉండగా దేవరకద్రపై పోలీస్ బాస్ డిఎస్‌పి కిషన్ గురి పెట్టారు. ఆయన పోలీస్ ఉద్యోగానికి రాజీనామా చేసి పూర్తి కాలపు రాజకీయాల్లో తన అగ్ని పరిక్షను ఎదుర్కోవాలని భావిస్తున్నారు. ముఖ్యంగా తమకు ఉన్న పాత పరిచయాలు, బిసి, ఓసి ఓట్లు తమకు లాభిస్తాయని ఆయన ఆశలు పెట్టుకున్నారు. సం క్రాంతి తర్వాత వేగంగా ప్రజల్లోకి వెళ్లాలని చూస్తున్నారు. పార్టీపరంగా ఇంకా ఏదీ ఖరారు కానప్పటికీ పోటీలో మాత్రం ఖచ్చితంగా ఉంటున్నారని ఆయన సన్నిహితులు భావిస్తున్నారు.

మఖ్తల్ నియోజకవర్గం:

రాష్ట్రంలోనూ పూర్తిగా వెనుకబడిన ప్రాంతం మఖ్తల్ నియోజకవర్గం. ఇక్కడ కూడా టిఆర్‌ఎస్ రెండు సార్లు గెలిచింది. ప్రస్తుత ఎమ్మెల్యే చిట్టెం రాంమ్మోహన్ రెడ్డి బారీ మెజార్టీతో గెలిచారు. మూ డో సారి ఇంకా భారీ మెజార్టీ తో గెలవాలని చూస్తున్నారు. అ యితే ఇక్కడ టిఆర్‌ఎస్ నుంచి ఆశావాహులు చాలా మంది ఉ న్నారు. డిసిసిబి చైర్మన్ నిజాం పాష, మైనార్టీ వర్గం తరుపున ఆ శిస్తున్నారు. ఇంకా వర్కటం జగన్నాదరెడ్డి, దేవరమల్లప్పలు ఆశిస్తున్నారు. వర్కటం జగన్నాదరెడ్డి మ ంత్రి కెటిఆర్‌కు సన్నిహితంగా ఉంటున్నారు.దేవరమల్లప్ప కూడా బిసి తరపున ఆశ లు పెట్టుకున్నారు. బిజెపి వా ల్మీకి కొండన్న, కాంట్రాక్టర్ జలంధర్ రెడ్డిలు ఆశిస్తున్నారు.కాంగ్రెస్ నుంచి నారాయణపేట డిసిసి అధ్యక్షులు వాకిటి శ్రీధర్, మాజీ ఎమ్మెల్యే దివంగ త వీరారెడ్డి కుమారుడు ప్రశాంత్ రెడ్డిలు ఆశిస్తున్నా రు. ఇంకా మాజీ ఎమ్మెల్యే సీతా దయాకర్ రెడ్డి సైతం ఇక్కడ నుంచి పోటీ చేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఈమె టిడిపిలో గత కొంత కాలంగా అంటీముట్టనట్లుగా ఉంటోంది. ఎన్నికల సమయానికి పార్టీ మారవచ్చునని చెబుతున్నారు.

నారాయణపేట నియోజకవర్గం…

నారాయణపేట నియోజకవర్గంలో తిరుగులేని నేత గా ఎమ్మెల్యేగా రాజేందర్ రెడ్డి ఉన్నారు. ఈయన కూడా మూడో సారి గెలిచి తన ప్రతాపం చూపనున్నారు. అటు కర్నాటకలోనూ, ఇటు రాష్ట్రంలోనూ వ్యాపారాలతో పాటు ఆసుపత్రులు ఉన్నాయి. ము ఖ్య నేతలతోనూ పరిచయాలు ఉన్నాయ. ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రస్తుతం బిఆర్‌ఎస్ పెట్టడడంతో రాయచూర్ ఎంపి పోస్టు కూడా తన సతీమణికి అడిగే చాన్స్ ఉందని చెబుతున్నారు.ఏవైనా పరిణామాలు జరిగితే ద్వితీయ శ్రేణి నాయకునిగా మాజీ మార్కెట్ యార్డు చైర్మన్, ప్రస్తుతం ఎంపిపిగా ఉన్న అమ్మకోలు శ్రీనివాస్ రెడ్డి ఆశలు పెట్టుకున్నారు. ఈయన ముందుగా పిఆర్‌పిలో రాజకీయ అరంగ్రేటం చేసి తర్వాత కాంగ్రెస్ తర్వాత టిఆర్‌ఎస్‌లో చేరారు. ఈ పార్టీలోనే మార్కెట్ యార్డ్ చైర్మన్‌గానై, ఎంపిపిగా పని చేశారు. బిజెపి నుంచి సీనియర్ నేతలు రతంగ పాండురెడ్డి, సతీష్ యాదవ్ లు ఆశిస్తున్నారు. సతీష్ యాదవ్ యువనేతగా ఉన్నారు. బిసి ఓటు బ్యాంక్‌పై ఆశలు పెట్టుకున్నారు. కాంగ్రె స్ నుంచి సీనియర్ నేత శివకుమార్ రెడ్డికి తప్ప ఇతరులకు వచ్చే అవకాశం లేదని చెబుత్నునారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News