Monday, September 1, 2025

కాళేశ్వరం రిపోర్ట్ కాపీలను చెత్తబుట్టలో వేసి.. అసెంబ్లీ నుంచి బిఆర్‌ఎస్ వాకౌట్

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : కాళేశ్వరం కమిషన్ రిపోర్టుపై చర్చ సందర్భంగా అసెంబ్లీలో గందరగోళం నెలకొంది. తమకు మైక్ ఇవ్వడం లేదని బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎలు అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసి బయటకు వచ్చారు. అక్కడి నుంచి గన్‌పార్క్ వద్ద అమరువీరుల స్థూపం వద్దకు వెళ్లారు. కెటిఆర్, హరీష్‌రావు సహా బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎలు అక్కడ కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ కాపీలను చెత్తబుట్టలో వేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అది ట్రాష్ రిపోర్ట్, అది చెత్త రిపోర్ట్ అంటూ బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళేశ్వరంపై చర్చ జరగాలి అనుకుంటున్నప్పుడు తమకు మైక్ ఎందుకు ఇవ్వట్లేదని బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ హరీష్ రావు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News