Thursday, April 25, 2024

కాంగ్రెస్‌ను వదిలేశారు…త్వరలోనే బిజెపిని మరిచిపోతారు

- Advertisement -
- Advertisement -

ప్రతి రాష్ట్రంలో బిఆర్‌ఎస్ పార్టీ కీలకంగా పని చేయనుందని ఆ పార్టీ ఎంఎల్‌సి కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. బిఆర్‌ఎస్ ఆధ్వర్యలోనే దేశ ప్రగతి మారనుందన్నారు. ఆదివారం భూపాలపల్లిలో టిబిజికెఎస్ ఆధ్వర్యంలో జరిగిన సింగరేణి యువ కార్మికుల సమ్మేళనంలో కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ”కాంగ్రెస్ పార్టీ హాత్ సే హాత్ జోడో కార్యక్రమం చేస్తుందని, కానీ దేశంలోని ప్రజలు హాత్ కా సాత్ కబ్ కా చోడ్ దియా అన్నట్లుగా ఉంది. ప్రజలు ఎప్పుడో కాంగ్రెస్ ను వదిలేశారు. ఇక త్వరలోన పువ్వు గుర్తు(బిజెపి)ను మరిచిపోతారు.

ఇప్పుడు దేశంలోని అన్ని వర్గాలు సిఎం కెసిఆర్ నాయకత్వాన్ని కావాలని చాలా బలంగా కోరుకుంటున్నారు. దేశ ప్రజల కోరిక మేరకే కెసిఆర్ బిఆర్‌ఎస్ పార్టీని ఏర్పాటు చేశారు. కారును ప్రజలు వేగంగా ముందుకు తీసుకెళ్తారు. బిఆర్ఎస్ పార్టీ రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో విజయం సాధించడం ఖాయం. అందుకే అన్ని రాష్ట్రాల్లో త్వరలోనే పార్టీ కార్యక్రమాలు మరింతగా ఊపందుకోనున్నాయి” అని పేర్కొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News