Saturday, December 14, 2024

కలెక్టర్ పై దాడి వెనక బిఆర్ఎస్ కార్యకర్త సురేష్ హస్తం

- Advertisement -
- Advertisement -

కొడంగల్: కొడంగల్‌లోని లగచర్ల గ్రామంలో కలెక్టర్ ప్రతీక్ జైన్‌పై దాడి చేయడం మీద సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. కలెక్టర్ ప్రతీక్ జైన్‌పై దాడిలో బోగమోని సురేష్ కుట్రదారుడిగా పోలీసులు గుర్తించినట్టు సమాచారం. ఈ ఘటనపై దర్యాప్తు చేసేందుకు డిజిపి ఆదేశాలతో వికారాబాద్‌కు ఎడిజి మహేశ్ భగవత్ చేరుకున్నారు. ఉద్దేశపూర్వకంగానే కలెక్టర్‌ను గ్రామంలోకి సురేష్ తీసుకెళ్లాడు. సురేష్ చెప్పగానే ప్రజలతో మాట్లాడానికి కలెక్టర్‌ ఊర్లోకి వెళ్లాడు.

గ్రామంలో ప్రజలతో మాట్లాడుతుండగా కలెక్టర్ పై గ్రామస్థులు దాడికి తెగపడ్డారు. దాడికి ముందు పట్నం నరేందర్ రెడ్డితో సురేష్ 42 సార్లు మాట్లాడాడు. సురేష్‌తోనూ మాట్లాడుతూనే నరేందర్ రెడ్డి కెటిఆర్‌తో ఫోన్‌లో ఆరు సార్లు మాట్లాడారు. బోగమోని సురేష్‌ను బిఆర్‌ఎస్ కార్యకర్తగా పోలీసులు గుర్తించారు.

సురేష్‌పై ఇప్పటికే రేప్ కేసులో సహా పలు కేసులు ఉన్నాయి. చెల్లెలు వరుసయ్యే అమ్మాయిపై అత్యాచారానికి పాల్పడిన కేసు అతడిపై ఉంది. సురేష్ బిఆర్ ఎస్ నేత పట్నం నరేంద్ర రెడ్డి ప్రధాన అనుచరుడిగా ఉన్నాడు. సురేష్‌పై కేసులు తొలగించేలా పట్నం నరేంద్ర రెడ్డి సాయం చేశాడు. కలెక్టర్‌పై దాడి తరువాత సురేష్ పరారీలో ఉన్నారు. బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్‌తో సురేష్ దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. లగచర్ల ఘటనలో ఇప్పటివరకు 52 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నామని ఎస్‌పి నారాయణ రెడ్డి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News