Thursday, October 10, 2024

రాష్ట్రంలో గుండా రాజ్యం నడుస్తోంది: హరీశ్ రావు

- Advertisement -
- Advertisement -

నర్సాపూర్: రాష్ట్రంలో గుండా రాజ్యం నడుస్తోందని బిఆర్ఎస్ నాయకుడు హరీశ్ రావు అన్నారు. ఎంఎల్ఏ సునీతా రెడ్డి అనుచరులపై ఆదివారం రాత్రి దాడి జరిగిన విషయంపై ఆయన తీవ్రంగా స్పందించారు. గోమారంలో విలేకరులతో మాట్లాడుతూ కాంగ్రెస్ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. తెలంగాణకున్న మంచి పేరును మంటగలిపి బీహార్ లా మారుస్తున్నారని విమర్శించారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెచ్చగొట్టే మాటలు ప్రతిపక్షాల మీద కాంగ్రెస్ కార్యకర్తలను రెచ్చగొట్టే విధంగా ఉన్నాయన్నారు. కాంగ్రెస్ గూండాలను వెంటనే అరెస్టు చేయాలన్నారు. రేవంత్ రెడ్డి పోలీసులను కూడా చెడగొడుతున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి శాశ్వతం కదన్న సంగతి పోలీసులు గుర్తుపెట్టుకోవాలన్నారు. గోమారంలో దాడి చేసిన గుండాలను అరెస్టు చేయాలని హరీశ్ రావు అన్నారు. దాడి చేసిన వారిని అరెస్టు చేయకపోతే డిజిపి కార్యాలయాన్ని ముట్టడిస్తామన్నారు. ఈ సమావేశంలో ఎంఎల్ఏలు సునీతా లక్ష్మారెడ్డి, చింత ప్రభాకర్, మాజీ ఎంఎల్ఏ క్రాంతి కిరణ్, మాజీ కార్పొరేషన్ చైర్మన్ భిక్షపతి, ఎర్రోళ్ల శ్రీనివాస్, నహీం, దొంతి సంతోష్ రెడ్డి, సత్యం గౌడ్, శేఖర్, మన్సూర్ వెంకట్ రెడ్డి, మాజీ ఎంపిపిలు హరికృష్ణ, నర్సింహులు,  బిఆర్ఎస్ మండల నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News