- Advertisement -
జమ్మూ కాశ్మీర్‌లోని సాంబా జిల్లాలో ఏడుగురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. శుక్రవారం తెల్లవారుజామున సాంబా జిల్లాలోని అంతర్జాతీయ సరిహద్దు వెంబడి భారీగా ఉగ్రవాదుల చొరబాటు ప్రయత్నాన్ని సరిహద్దు భద్రతా దళం (BSF) భగ్నం చేసింది. జైష్-ఎ-మొహమ్మద్ (JeM) తో సంబంధం ఉన్నట్లు అనుమానిస్తున్న ఏడుగురు ఉగ్రవాదులను హతమార్చినట్లు అధికారులు వెల్లడించారు. నిన్న రాత్రి 11 గంటల ప్రాంతంలో సాంబా సరిహద్దు సమీపంలో నిఘా గ్రిడ్ ద్వారా అనుమానాస్పద కదలికను BSF దళాలు గుర్తించి.. చొరబడేందుకు ప్రయత్నించిన ఉగ్రవాదులను అంతమొందించాయి. ఒక రేంజర్స్ పోస్టును కూడా ధ్వంసం చేశాయి.
- Advertisement -