Friday, March 29, 2024

పాక్ డ్రోన్‌ను కూల్చేసిన బిఎస్‌ఎఫ్

- Advertisement -
- Advertisement -

అమృతసర్: భారత గగనతలంలోకి ప్రవేశించిన పాకిస్థాన్ డ్రోన్ బిఎస్‌ఎఫ్ శుక్రవారం కూల్చివేసింది. అంతర్జాతీయ సరిహద్దు నుంచి పంజాబ్ సరిహద్దులోకి ప్రవేశించిన పాక్ డ్రోన్‌ను సరిహద్దు బలగాలు కూల్చేవేశాయని ప్రతినిధితెలిపారు. మానవ రహిత పాక్ డ్రోన్ అమృతసర్ సెక్టార్‌లోని సరిహద్దు పోస్టు వద్ద భద్రతా బలగాలు ఉదయం 7.45కు గుర్తించాయి. కాల్పులు జరిపి డ్రోన్‌ను కూల్చేసిన అనంతరం దాన్ని భద్రాత దళం స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేపట్టింది.

పరిసర ప్రాంతాల్లో డ్రోన్ నుంచి ఏమైనా జారవిడిచారనేది పరిశీలిస్తున్నామని బిఎస్‌ఎఫ్ అధికారి ప్రతినిధి మీడియాకు తెలిపారు. ఆరడుగుల పొడువు ఉన్న డ్రోన్ 25కేజీల పేలుడు సామగ్రిని తీసుకువెళ్లగల సామర్థం ఉంది. నిర్దేశించిన ప్రాంతంలో సామగ్రిని జారవిడిచే యంత్ర అమరిక ఉందని అధికారులు గుర్తించారు. పంజాబ్‌లో పాక్ డ్రోన్‌లను కూలేయడం వరుసగా మూడో రోజూ జరిగింది. డిసెంబర్ 21 పాక్ డ్రోన్‌ను భద్రతా బలగాలు కూల్చేవేయగా సరిహద్దు ఆవల పడటంతో పాక్ రేంజర్లు దాన్ని తెలిపింది. గురువారం తరణ్ జిల్లాలో పాక్ డ్రోన్‌ను భారత బలగాలు కూల్చేవేశాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News