Tuesday, December 10, 2024

బీఎస్‌ఎన్‌ఎల్‌ చౌక రీఛార్జ్ ప్లాన్..

- Advertisement -
- Advertisement -

దేశంలోని ప్రముఖ టెలికాం కంపెనీలు జియో, ఎయిర్‌టెల్ వీ ఇటీవల తమ రీఛార్జ్ ప్లాన్‌ల ధరలను పెంచేసిన విషయం తెలిసిందే. దీని కారణంగానే దేశంలోని చాలా మంది తమ సిమ్‌ను బీఎస్‌ఎన్‌ఎల్‌కి పోర్ట్ చేసుకున్నారు. అయితే ఇదే అదనంగా పెట్టుకొని ప్రభుత్వ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ వివిధ చౌక ప్లాన్లను ప్రవేశ పెడుతూ దీన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుంటోంది. ఇందులో భాగంగానే బీఎస్‌ఎన్‌ఎల్‌ కేవలం రూ. 108 కే 2 నెలల చెల్లుబాటు, డేటా, అపరిమిత కాలింగ్ సౌకర్యాన్ని అందించే ప్లాన్‌ తీసుకువచ్చింది. ఇప్పుడు దాని గురుంచి పూర్తిగా తెలుసుకుందాం.

రూ.108 ప్లాన్ వివరాలు

కేవలం రూ. 108 ధరతో వస్తున్న ఈ ప్లాన్ 60 రోజుల సుదీర్ఘ వాలిడిటీతో అనేక గొప్ప ప్రయోజనాలను అందిస్తుంది. తక్కువ ఖర్చుతో మెరుగైన సేవ కోసం చూస్తున్న వినియోగదారులకు ఇది గొప్ప ప్లాన్. అపరిమిత కాలింగ్ సదుపాయం కూడా ఇందులో ఉంది. ఏ నెట్‌వర్క్‌కైనా కాల్ చేయడానికి ఉపయోగించవచ్చు. అదనంగా, వినియోగదారులు 60GB డేటాను కూడా పొందుతారు. ఇది ప్రతిరోజూ 1GB వరకు హై-స్పీడ్ డేటాను ఉపయోగించడానికి అనుమతిస్తుంది. ఇది కాకుండా.. ఈ ప్లాన్‌లో 500 ఉచిత SMS కూడా అందుబాటులో ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News