Friday, April 26, 2024

యుపి ఎన్నికలు.. 300 స్థానాలకు బిఎస్‌పి అభ్యర్థుల ఖరారు

- Advertisement -
- Advertisement -

BSP candidates finalized for 300 seats in UP elections

అభ్యర్థుల ఎంపికలో మిగతా పార్టీల కన్నా బిఎస్‌పి ముందంజ
2007 ఎన్నికల విజయసూత్రంపై త్వరలో దళితులు, ముస్లిం అభ్యర్థుల ఎంపిక

లక్నో : ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికల్లో పోటీ చేయనున్న అభ్యర్థుల ఎంపికలో మిగతా పార్టీల కన్నా బహుజన్ సమాజ్ పార్టీ ముందుంది. ఈపాటికే మొత్తం 400 స్థానాలకు గాను 300 స్థానాల్లో అభ్యర్థులను ఖరారు చేసింది. ఈ అభ్యర్థుల్లో 90 మంది దళితులు ఉన్నారని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ఎస్‌సి మిశ్రా గురువారం వెల్లడించారు. బిజెపి , సమాజ్‌వాదీ పార్టీలను ఉద్దేశించి మాట్లాడుతూ ఆ పార్టీలు ఇప్పటికీ గెలుపుపై ధీమా లేకపోవడంతో తమ అభ్యర్థులను ఖరారు చేయలేదని వ్యాఖ్యానించారు. ఇప్పటికే దాదాపు 300 మంది అభ్యర్థులను ఖరారు చేశామని, మిగతా స్థానాలకు కూడా త్వరలోనే అభ్యర్థులను ఖరారు చేస్తామని చెప్పారు. అయితే బ్రాహ్మణులు, ముస్లింల పరిస్థితి ఏంటని అడగ్గా జనవరి 15 న పార్టీ అధ్యక్షురాలు మాయావతి పుట్టిన రోజు ఉందని, ఆ తరువాత ఆయా అభ్యర్థుల ఎంపిక జరుగుతుందని వివరించారు. మాయావతి ఈసారి ఈ ఎన్నికల్లో పోటీ చేయనని ప్రకటించినప్పటికీ తమ పార్టీ 2007 ఎన్నికల నాటి విజయసూత్రాన్ని అనుసరించి దళితులు, ముస్లింలను కలుపుకుని పోటీ చేస్తుందని మాయావతి ఈపాటికే ప్రకటించారు.

బహుజన్ సమాజ్ పార్టీకి ముస్లిం సామాజిక వర్గంలో చెప్పుకోతగిన ఓట్ల వాటా ఉంది. ఉత్తర ప్రదేశ్‌లో దళితుల జనాభా 20 శాతం ఉండగా, బ్రాహ్మణులు 13 శాతం, ముస్లింలు దాదాపు 20 శాతం వరకు ఉన్నారు. ఫిబ్రవరి 10న అసెంబ్లీ మొదటి దశ ఎన్నికలు జరగనుండగా, ఇతర పార్టీలు ఇప్పటివరకు అభ్యర్థులను నిర్ణయించలేక పోవడాన్ని మిశ్రా ఎద్దేవా చేవారు. ఎన్నికల సంసిద్ధత గురించి మాట్లాడుతూ రాష్ట్రం లోని 75 జిల్లాల్లో తానొక్కడినే 96 ప్రచార ర్యాలీలను నిర్వహించానని, పార్టీ లోని ఇతర నాయకులు కూడా అనేక బహిరంగ సభలు నిర్వహించారని చెప్పారు. మాయావతి, ఇతర నేతలు గత ఏడాదిగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గాన్ని లోతుగా అధ్యయనం చేసి, స్థానికుల నుంచి సేకరించిన సమాచారంతో అభ్యర్థులను నిర్ణయించడమౌతోందని మిశ్రా చెప్పారు. గురువారం మాయావతి ఇద్దరు అభ్యర్థులను నిర్ణయించారు. వారిలో ఒకరు యుపి మాజీ హోం మంత్రి సైదుజ్జమాన్ కుమారుడైన సయీద్ కాగా, మరొకరు నోమాన్ మసూద్.

సయీద్ బుధవారం కాంగ్రెస్ నుంచి బిఎస్‌పిలో చేరారు. మసూద్ మాజీ కేంద్ర మంత్రి రషీద్ మసూద్ మేనల్లుడే కాకుండా సమాజ్‌వాది పార్టీ నేత ఇమ్రాన్ మసూద్ సోదరుడు. పార్టీ అధికార ప్రతినిధి ఎంహెచ్ ఖాన్ ఈ సందర్భంగా మాట్లాడుతూ గత ఆరు నెలలుగా పోలింగ్ బూత్ వారీ ఏర్పాట్లు చేస్తున్నామని, ఎలాంటి కళంకిత , నేర చరిత్ర లేని అభ్యర్థుల కోసం క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నామని చెప్పారు. ఎస్‌పి లేదా బిఎస్‌పి తమ స్వంత పార్టీ నాయకులపై విశ్వాసం ఉంచుతాయని, విశ్వాసఘాతకుల గురించి నిరీక్షించకుండా అభ్యర్థుల జాబితా వెల్లడిస్తాయని అన్నారు. టికెట్ ఆశించే వారి రద్దీ ఎక్కువగా ఉన్నప్పటికీ ప్రతిసారి ఎన్నికల్లో తమ విధేయతను మార్చుకునే విశ్వాసఘాతకులను నిరుత్సాహపర్చడానికే బిఎస్‌పి నిర్ణయించిందని వివరించారు. ఉత్తరప్రదేశ్‌లో ఫిబ్రవరి 10 నుంచి ఏడు దశల్లో ఎన్నికలు జరుగుతాయి. మార్చి 10 న ఓట్ల లెక్కింపు జరుగుతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News