Thursday, April 18, 2024

బుద్ధవనానికి అంతర్జాతీయ అవార్డు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : నాగార్జున సాగర్‌లోని బుద్ధవనం ప్రాజెక్టును అంతర్జాతీయ బంగ్లాదేశ్ భూటాన్ ఇండియా నేపాల్ కంట్రీస్ టూరిజం మిత్ర అవార్డు వరించింది. ఈ మేరకు కోల్‌కతా సిటీ సెంటర్‌లో మూడు రోజుల సదస్సు ప్రారంభోత్సవ సభలో కొరియా ఇండియా ఫ్రెండ్‌షిప్ అసోసియేషన్ ఛైర్మన్ భిక్షు దమ్మ దీప చేతుల మీదుగా బుద్ధవనం ప్రత్యేకాధికారి మల్లెపల్లి లక్ష్మయ్య అవార్డును అందుకున్నారు.

ఈ అవార్డు రావడానికి ముఖ్య కారదణం.. ఆసియా దేశాల్లోనే ప్రత్యేకతలు గత బుద్ధవనం లోని వివిధ విభాగాలు బౌద్ధశిల్ప కళ , బౌద్ధ పర్యాటకాభివృద్ధికి, బౌద్ద సంస్కృతి, పరిరక్షణకు శాంతిని పెంపొందిస్తున్న మల్లెపల్లి లక్షయ్య సేవలకు గుర్తింపుగా ఈ అవార్డును ప్రకటించినట్లు అంతర్జాతీయ బౌద్ద పర్యాటక నిర్వాహక మండలి వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి డా. కౌలేష్ కుమార్, అధ్యక్షులు డా. రవీంద్రపంత్ లు శుక్రవారం నాడొక ప్రకటనలో పేర్కొన్నారు.

కాగా ఈ కార్యక్రమంలో తెలంగాణ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బుద్ధవనం స్టాల్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందని బెంగాల్ పర్యాటక శాఖ కార్యదర్శి డా. సుమిత్రా మోహన్, కేంద్ర పర్యాటక శాఖ ప్రాంతీయ సంచాలకులు డా. సాగ్నిక్ చౌదురి తెలిపారు. ఈ సదస్సుకు హాజరైన బంగ్లాదేశ్ బౌద్ద బిక్షువు డా. కరుణానంద, నేపాల్‌కు చెందిన రమేష్ థాపా, థాయిలాండ్ పర్యాటక మండలి ఉపాధ్యక్షులు శాంసంగ్ , బంగ్లాదేశ్ పాటా కార్యాదర్శి తారీఫ్ రహమాన్, శ్రీలంక ప్రతినిధి లంకాతిలంక, బుద్దవనం స్టాల్‌ను సందర్శించి మల్లెపల్లి లక్షయ్యనుఅభినందించారు.

ఈ అంతర్జాతీయ బౌద్ధ సదస్సులో బుద్ధవనం ప్రత్యేకతలపై మల్లెపల్లి లక్ష్మయ్య బుద్ధవనం బుద్దిజం ఎక్స్‌పర్ట్ కన్సల్టెంట్ డా ఈమని శివనాగిరెడ్డి ఇచ్చిన పవర్ పాయింట్ ప్రెజంటేషన్ వీడియో ప్రదర్శనకు సందర్శకుల నుండి విశేష స్పందన వచ్చింది. ఇంకా ఈ కార్యక్రమంలో తెలంగాణ పర్యాటకాభివృద్ధి సంస్థ మార్కెటింగ్ జనరల్ మేనేజర్ డా. అంజిరెడ్డి బుద్దవనం డిజైన్ ఇంఛార్జీ శ్యామ్ సుందర్ రావు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News