Tuesday, December 10, 2024

పెళ్లి జరుగుతుండగా వధువు తలలోకి దూసుకెళ్లిన బుల్లెట్

- Advertisement -
- Advertisement -

ఛండీఘఢ్: పెళ్లి జరుగుతుండగా వధువు తలలోకి బుల్లెట్ దూసుకెళ్లడంతో ఆమె తీవ్రంగా గాయపడింది. ఈ సంఘటన పంజాబ్ రాష్ట్రం ఫిరోజ్‌పూర్ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. హశమ్ తూత్ గ్రామానికి చెందిన బాజ్ సింగ్ అనే వ్యక్తి కూతురు బల్జిందర్ కౌర్‌ను సరహళ్లి కలాన్ గ్రామానికి చెందిన గుర్‌ప్రీత్ సింగ్‌కు ఇచ్చి పెళ్లి చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఖయ్‌ఫేమ్ కి గ్రామంలో ఆదివారం పెళ్లి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. పెళ్లి సంబరాలలో భాగంగా బంధువులో తుపాకీ తీసుకొని గాల్లోకి కాల్పులు జరిపారు. బుల్లెట్ వధువు తలలోకి దూసుకెళ్లడంతో కుప్పకూలింది. వెంటనే ఆమెను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. డిఎస్‌పి సుఖ్వీందర్ సింగ్ ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పెళ్లి మండపంలో ఉన్న సిసి ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News