Thursday, July 17, 2025

ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్.. భారీ రికార్డుపై కన్నేసిన బుమ్రా

- Advertisement -
- Advertisement -

ఇంగ్లండ్‌తో భారత్ త్వరలోనే ఐదు టెస్టుల సిరీస్‌లో తలపడనున్న విషయం తెలిసిందే. జూన్ 20వ తేదీ నుంచి తొలి టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కానుంది. అయితే ఈ సిరీస్‌తో డబ్ల్యూటిసి 2025-27 కూడా ప్రారంభం అవుతుంది. అయితే ఈ సిరీస్‌లో భారత పేసర్ జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) ఓ భారీ రికార్డుపై (New Record) కన్నేశాడు. ఈ సిరీస్‌లో బుమ్రా (Jasprit Bumrah) రెండుసార్లు ఐదు వికెట్ల హౌల్ సాధిస్తే.. డబ్ల్యూటిసి చరిత్రలోనే 12 సార్లు ఐదు వికెట్ల హౌల్ సాధించిన తొలి బౌలర్‌గా రికార్డు (New Record) అందుకుంటాడు.

కాగా, ఈ టెస్ట్ సిరీస్‌ ఇండియాకు ఎంతో ప్రతిష్టాత్మకమైంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు రిటైర్‌మెంట్ ప్రకటించడంతో కొత్త, పాత ఆటగాళ్లతో టీం ఇండియా ఈ సిరీస్ బరిలోకి దిగుతోంది. ఇందులో అనుభవం ఉన్న ఆటగాళ్లు కొందరే ఉన్నారు. దీంతో ఇంగ్లండ్ జట్టును భారత్ ఎలా ఎదురుకుంటుందనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. ముఖ్యంగా కొత్త కెప్టెన్‌ శుభ్‌మాన్ గిల్ జట్టును ఎలా ముందుకు నడిపిస్తాడో అని అందరూ ఎదురుచూస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News