Tuesday, September 10, 2024

బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌.. బుమ్రాకు విశ్రాంతి!

- Advertisement -
- Advertisement -

బంగ్లాదేశ్‌తో సొంత గడ్డపై జరిగే రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో పాల్గొనే భారత జట్టులో సీనియర్ బౌలర్ జస్‌ప్రిత్ బుమ్రాకు విశ్రాంతి ఇచ్చే అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి. ఇంగ్లండ్, ఆస్ట్రేలియాలతో జరిగే సిరీస్‌ల నేపథ్యంలో బుమ్రాను బంగ్లా టెస్టులకు దూరంగా ఉంచాలని బిసిసిఐ పెద్దలు భావిస్తున్నట్టు సమాచారం.

బంగ్లాదేశ్‌తో సెప్టెంబర్‌లో భారత్ రెండు మ్యాచ్‌లను ఆడనుంది. ఈ సిరీస్‌కు ముందు ప్రతిష్ఠాత్మకమైన దులీప్ ట్రోఫీ జరుగనుంది. ఈ ట్రోఫీ కోసం ఇప్పటికే జట్లను ప్రకటించారు. అయితే నాలుగు జట్లలో కూడా బుమ్రాకు చోటు దక్కలేదు. ఇలాంటి స్థితిలో అతన్ని బంగ్లాదేశ్ సిరీస్‌లో విశ్రాంతి కల్పించడం ఖాయంగా కనిపిస్తోంది. మరోవైపు సీనియర్ బౌలర్ మహ్మద్ షమీ బంగ్లా సిరీస్‌లో బరిలోకి దిగే అవకాశాలున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News