Saturday, October 5, 2024

బుమ్రా అది చేస్తే చాలు.. ఎన్నో రికార్డులు బద్దలు: జహీర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: బుమ్రా భవిష్యత్ లో ఎన్నో రికార్డులు బద్దలు కొట్టడం ఖాయమని టీమిండియా మాజీ బౌలర్ జహీర్ ఖాన్ ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఉన్న పేసర్లలో అతడు నెంబర్ వన్ బౌలర్ అని కొనియాడారు. బుమ్రా బౌలింగ్ శైలి ప్రత్యేకమని, ప్రపంచంలో అద్భుతమైన బౌలర్ అని ప్రశంసించారు. భారత్ పిచ్ లపై పేస్ ను రాబట్టడం అంత సులువేం కాదని, అసాధారణ పరిస్థితుల్లోనూ ఎలాంటి బంతులు సంధించాలనేది బుమ్రాకు బాగా తెలుసునన్నారు. బుమ్రాలాంటి బౌలర్ పరిస్థితులతో సంబంధ లేకుండా బౌలింగ్ చేస్తాడని మెచ్చుకున్నారు. పిచ్ స్వింగ్, సీమ్ అనుకూలిస్తే బుమ్రాను ఆపడం ఎవరితరము కాదని, యార్కర్లు, స్లో డెలివరిలతో బ్యాటర్లను ముప్పతిప్పలు పెడుతాడని జహీర్ ఖాన్ ప్రశంసించారు. బుమ్రా కెరీర్ లో నాలుగు వందలకు పైగా వికెట్లు తీయడం సాధారణమైన విషయం కాదన్నారు. బుమ్రా ఇలాగానే ఆడితే ఎన్ని రికార్డులు కొల్లగొట్టడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. బుమ్రా తన శరీరం విషయంలో అతి జాగ్రత్తలు తీసుకోవాలని, ఫిట్ నెస్ పై నిరంతరం దృష్టి పెడితేనే ఎక్కుల కాలం బౌలింగ్ చేయగలుగుతాడని జహీర్ సలహా ఇచ్చారు. భారత పేస్ బౌలర్లలో మూడు ఫార్మాట్లలో కలిపి బుమ్రా(402) కంటే కపిల్ దేవ్(687), జహీర్ ఖాన్(597) ముందున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News