కార్టూన్ డ్రాయింగ్‌లో ఎనాటమీ, అద్భుతమైన గీతలు అవసరం లేదు. సమకాలీన రాజకీయ, సామాజిక అంశాల మీద కొంచెం హాస్యం, వ్యంగ్యంతో చిన్న క్యాప్షన్, నాలుగు గీతలు గీస్తే చాలు అని భారతీయ సీనియర్ కా ర్టూన్ కళాకారులు నిరూపించారు. 197080 మధ్య కుట్టి, ఆబు అబ్రహాం, ఒ.వి.విజయన్ ఇలాగే కార్టూన్లు వేసి పాఠకులను ఆకట్టుకోవడ మే కాక ఆలోచనలు రేకిత్తించారు. కార్టూన్ కళ లో అదొక భిన్నమైన శైలి. ఇపుడు అదేశైలిలో కార్టూన్లు వేస్తున్న మరొక కార్టూనిస్టు బి.పి.ఆచార్య.
1985లో భద్రాచలంలో సబ్ కలెక్టర్‌గా పనిచేయడంతో బీపీ ఆచార్య ఉద్యోగ జీవితం మొదలయింది. అప్పట్లో గోదావరి వరదలు వచ్చినపు డు ప్రజలకు నష్టం కలగకుండా ఆచార్య తీసుకు న్న ముందు జాగ్రత్తల వల్ల ప్రాణ నష్టాన్ని నివారించారు. ఆ తరువాత వరంగల్ జిల్లా డిడిఓగా, కలెక్టర్‌గా ఏడేళ్లు పని చేసారు. కాకతీయ ఉత్సవా లు నిర్వహించి తెలంగాణ సంప్రదాయాలను గౌరవించారు. తన 37 ఏళ్ల కెరియర్‌లో దాదాపు ఒక దశాబ్దం (మార్చి 2001-డిసెంబర్ 2009) పాటు, పరిశ్రమల శాఖలో పనిచేశారు.
ఆయన విద్యార్థి దశలోనే కార్టూనింగ్ పట్ల ఆసక్తి పెంచుకున్నారు. ఐఎఎస్‌గా వివిధ హోదా ల్లో పనిచేయడం మొదలయ్యాక సమయం అనుకూలించక కార్టూనింగ్‌కి దూరం అయ్యారు. అయినప్పటికీ ప్రతీ సంవత్సరం నూతన సంవత్స ర గ్రీటింగ్‌లను, కార్టూన్‌లుగా రూపొందించి మిత్రులకు పంపేవారు. అలా తనలోని కార్టూనిస్టుని కాపాడుకునే వారు. రిటైర్ అయ్యాక తన పూర్తి సమయం కార్టూన్లకే ఉపయోగిస్తున్నారు.
ఇటీవల విద్యార్థి దశ నుండి రిటైర్‌మెంట్ వరకు తన అనుభవాలను కార్టూన్లుగా మలచి ‘Obtuse Angle’ అనే కార్టూన్ పుస్తకం ప్రచురించారు. సివిల్ సర్వెంట్‌గా కొనసాగిన ప్రయాణంలో ఎదురైన సవాళ్లను, కష్టాలను, సరదా క్ష ణాలను తన వ్యంగ్య రేఖల్లో ప్రతిబింబించారు. రాజకీయ, సామాజిక, ఆర్థిక అంశాలపై వేసిన వందకుపైగా కార్టూన్లు ఈ పుస్తకంలో ఉన్నాయి. ఈ కార్టూన్లు కేవలం ఆయన కళాత్మక ప్రతిభ మా త్రమే కాదు, రాజకీయ పరిపాలనా వ్యవస్థలోని లోపాలను ఎత్తి చూపాయి. కార్టూనిస్టుగా ఆయన లోతైన అవగాహనకు సాక్ష్యంగా నిలిచాయి.
ఆర్‌కె.లక్ష్మణ్ ప్రేరణ
“మనమంతా సాధారణంగా ఏదైనా విష యం గురించి తక్కువ కోణం (acute angle) నుంచి చూస్తుంటాం. అంటే విమర్శనాత్మక దృష్టి తో. కానీ, ఒక కార్టూనిస్ట్ మాత్రం ప్రతీ దానిలో ‘Obtuse Angle’ అంటే వినోదాత్మక కోణాన్ని వెతుకుతాడు. హాస్యాన్ని, వ్యంగ్యాన్ని, జీవితంలో ని హుందాతనాన్ని.. అదే నా కార్టూన్ కాలమ్‌కు మూల ప్రేరణ. బాల్యం నుంచి కార్టూన్లు అంటే మక్కువ. లక్ష్మణ్, మారియో, కుట్టి వంటి కార్టూనిస్టుల శైలిని అనుకరించేందుకు ప్రయత్నించేవాడిని. ముఖ్యంగా లక్ష్మణ్ చేసిన కార్టూన్లు నాకు ఎంతో ప్రేరణగా మారాయి. ఆయన గీతలను చూస్తూ రాజకీయ నాయకుల వ్యక్తిత్వాన్ని అతను ఎలా బంధించాడో నేర్చుకున్నాను. ఈ పాఠాలు నా కార్టూన్ కెరీర్ ప్రారంభానికి బలంగా పనిచేశాయి” అంటారు బి.పి.ఆచార్య. 1980లలో JNUలో చదువుతున్నపుడు స్టూడెంట్స్ యూనియన్ ఎన్నికల్లో విప్లవాత్మక భావాలతో కార్టూన్లు వేసేవారు. 1981లో JNU SU ఎన్నికల సమయంలో ఆచార్య కార్టూన్లు పోస్టర్లుగా కూడా ప్రచారంలో స్టూడెంట్స్ ఉపయోగించారు అని ఆయన అంటారు.
1983లో సివిల్ సర్వీస్‌లో చేరాక, ఆయన కు అసలు సమస్యలు ప్రారంభమయ్యాయి. ఒక ప్రభుత్వ అధికారి హోదాలో ఉండి, కొన్ని పరిమితుల మధ్య వ్యంగ్యాన్ని వెలిబుచ్చడం కష్టం. అయినప్పటికీ ముస్సోరీలోని లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీలో శిక్షణ పొందుతున్నపు డు హౌస్ జర్నల్ సెక్రటరీగా పనిచేసిన సమయం లో, డైనింగ్ హాల్ ఎదురుగా ఉన్న గోడపై కార్టూన్లు ప్రదర్శించేవారు. అలా ఆయన కార్టూన్ కళ అధికారుల జీవనశైలిని చూపించే ప్రత్యేక కోణంగా మారింది.
జీవితం నుండి హాస్యం
“1983 నుండి 85 మధ్య ‘Mussoorie Miscellany’ అనే పేరుతో వచ్చిన కార్టూన్లు, ఉద్యోగానికి కొత్తగా వచ్చిన అధికారుల జీవితం లో ఉండే ఆటుపోట్లను హాస్యంగా చిత్రీకరించా యి. ‘డ్రెస్ కోడ్’, ‘టేబుల్ మేనర్స్’, ‘భారత్ దర్శ న్’ వంటి విషయాలను చక్కగా స్పూఫ్ చేయడం మొదలుపెట్టాను. ఒకసారి టై ధరించకపోయినందుకు, లాల్ బహదూర్ శాస్త్రికి అకాడమీలో ప్రవేశం నిషేధించారంటూ వేసిన కార్టూన్ 2023 లో అధికారికంగా అకాడమీ మెమొరబిలియా వాక్‌లో ప్రదర్శించారు. 1990ల మధ్యన ‘Obtuse Angle’ అనే శీర్షికతో IAS బులెటిన్‌కి నెలవారీ కార్టూన్లు సమర్పించేందుకు అవకాశం వచ్చింది. సాధారణ అధికారుల జీవితం, వారి పరిపాలనా సమస్యలు, రాజకీయ అధిపతులతో ఉండే గందరగోళాల్ని వీటిలో స్పష్టంగా చూపించాను. 2008లో ముంబైలోని ‘Money Life’ పత్రిక సంపాదకులు సుచేతా దలాల్, దేవాషిస్ బసు గారితో పరిచయం అయ్యాక, ఆర్థిక అంశాలపై కార్టూన్లు వేయమని సూచించడంతో, నేను అంగీకరించాను. ఆ తరువాత It’s the economy, stupid అనే శీర్షికతో కార్టూన్లు వేసాను. ఇవి 200811 మధ్య గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్, వాల్ స్ట్రీట్ కుప్పకూలిన పరిస్థితులు వంటి అంశాలపై ఉండేవి..” అన్నారు ఆచార్య.
దినపత్రిక మొదటి పేజీలో
2017లో హైదరాబాదులోని ‘Goethe Zentrum’ డైరెక్టర్ అమితా దేశాయ్ గారి పర్యవేక్షణలో ఆచార్య కార్టూన్ల ప్రదర్శన జరిగింది. విశే ష స్పందన లభించింది. అప్పుడే, తన కార్టూన్ జ ర్నీని పుస్తకంగా ప్రచురించాలని నిర్ణయించారు.
2020లో Pioneer పత్రిక ఆదివా రం సంచికలో కార్టూన్లు వేసే అవకాశం కలిగింది. తరువాత ఆ పత్రిక ఫ్రంట్ పేజీ లో కలర్ కార్టూన్లు కూడా వేశారు. 2022 లో ఆయనకు ‘Hybiz Media Awards’ ఉత్తమ కార్టూనిస్ట్ అవార్డు లభించింది. 2023లో ‘Hans India’ పత్రికలో ‘Medley’ పేరుతో కార్టూన్ల కాలమ్ ప్రారంభమైంది.
‘Obtuse Angle’ పుస్తకంలో నాలుగు దశాబ్దాలుగా సృష్టించిన కార్టూన్లు ఉన్నాయి. ఆచార్య వ్యక్తిగత జీవితాన్ని, సివిల్ సర్వీస్‌లో ఎదురైన ఒ డిదుడుకులను, సమకాలీన రాజకీయాలను, ఆర్థి క పరిస్థితులను చూపించే పలు కోణాల్లో ఈ కా ర్టూన్లు ఉంటాయి. “ఈ ప్రయాణం నన్ను ఓ అధికారి నుండి వ్యంగ్య చిత్రకారుడిగా తీర్చిదిద్దింది. నాకు కలిసొచ్చిన ఈ ‘Obtuse Angle’ని మీ రూ ఆస్వాదిస్తారని ఆశిస్తున్నా” అని అంటారు బి.పి.ఆచార్య.
(Obtuse Angle పుస్తకం అమెజాన్‌లో అందుబాటులో ఉంది)
శ్యాంమోహన్