Tuesday, April 30, 2024

పాకిస్థాన్‌లో లోయలో బస్సు పడి 17మంది యాత్రికులు మృతి

- Advertisement -
- Advertisement -

కరాచి: పాకిస్థాన్ లోని సింథ్, బలోచిస్థాన్ ప్రావిన్స్‌ల సరిహద్దులో బుధవారం యాత్రికులతో వెళ్తున్న బస్సు అదుపు తప్పి లోయలో పడిపోవడంతో 17 మంది యాత్రికులు ప్రాణాలు కోల్పోయారు. 38 మంది గాయపడ్డారు. కరాచీకి 100 కిమీ దూరంలో ఈ ప్రమాదం జరిగింది. సింథ్ ప్రావిన్స్‌లోని థట్టా పట్టణానికి చెందినవారు. రంజాన్ సందర్భంగా బలోచిస్తాన్ లోని ఖుజ్‌డార్ జిల్లాలో మారు మూల ప్రాంతంలో ఉన్న ముస్లిం సూఫీ మసీదుకు వీరు బుధవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో థట్టా నుంచి బస్సులో బయలుదేరారు.

రాత్రి 8 గంటల సమయంలో హబ్ పట్టణానికి వీరు చేరుతుండగా బస్సు అదుపు తప్పిఅక్కడ ఉన్న లోయలో పడిపోయిందని పాకిస్థాన్ మంత్రి మొహిసిన్ నక్వీ చెప్పారు. హబ్ పట్టణం లోని స్థానిక పోలీస్ అధికారులు మృతదేహాలను, గాయపడిన వారిని కరాచీ లోని సివిల్ ఆస్పత్రికి తరలించారు. మృతులను అక్కడ గుర్తించారు. మృతుల్లో కొందరు ఒకే కుటుంబాలకు చెందిన వారిగా తెలిసింది. పాక్‌లో రోడ్లు అధ్వాన్నంగా ఉండడం పరిపాటి. దీనికి తోడు ట్రాఫిక్ నిబంధనలు పాటించక వాహనాలను నిర్లక్షంగా నడుపుతుండడంతో ప్రమాదాలు తరచుగా జరుగుతున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News