వాకింగ్ ఆరోగ్యానికి ఎంతో మంచిది. బరువు తగ్గాలనుకునే వారికి వాకింగ్ సులభమైన మార్గం. అయితే, వాకింగ్ ఎప్పుడు చేయాలనే విషయంపై అవగాహన ఉండాలి. కొందరు ఉదయాన్నే వాకింగ్ చేస్తే. మరి కొందరు సాయంత్రం వాకింగ్ చేస్తారు. అయితే సాధారణంగా తిన్న తర్వాత వాకింగ్ చేయాలా వద్దా అనే అంశంపై వివిధ అభిప్రాయాలు వినే విని ఉంటారు. అయితే కొందరు భోజనం తర్వాత వాకింగ్ చేస్తే మంచిదని భావిస్తారు. మరికొందరు భోజనం తర్వాత వాకింగ్ చేయడం మంచిది కాదని నమ్ముతారు. ఈ క్రమంలో పలువురు వైద్యులు భోజనం తర్వాత వాకింగ్ చేయాలా వద్దా అని వివరించారు.
వైద్యులు చెప్పిన ప్రకారం.. భోజనం తర్వాత దాదాపు 10 నుండి 15 నిమిషాలు పాటు అవసరమని చెప్పారు. భోజనం తర్వాత వాకింగ్ చేస్తే జీర్ణ వ్యవస్థ సరిగ్గా పనిచేస్తుంది. అంతేకాకుండా షుగర్ మెటబాలిజంలో ఎంతో సహాయపడుతుంది. తిన్న తర్వాత వాకింగ్ చేస్తే షుగర్ లెవెల్స్ పెరిగే అవకాశం తగ్గుతుంది. అయితే భోజనం తర్వాత వాకింగ్ సరైన రీతిలో చేయాలి. వాకింగ్ భోజనం చేసిన తర్వాత తేలికగా, ఇంట్లో చేసే విధంగా ఉండాలి.