Monday, May 20, 2024

గ్రూప్-4 పరీక్షకు అభ్యర్థులు సకాలంలో హాజరు కావాలి

- Advertisement -
- Advertisement -

నల్గొండ : తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ -4 పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు సకాలంలో, ము ందస్తుగా పరీక్షా సెంటర్లకు చేరుకోవాలని జిల్లా కలెక్టర్ టి.వినయ్ కృష్ణా రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జూలై -1న ఉదయం 10 నుండి 12-.30 వరకు, మధ్యాహ్నం 2-.30 నుంచి 5 గంటల వరకు జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో పరీక్ష కేంద్రాలు ఉన్నందున అభ్యర్థులు గంట ముందుగా సకాలం లో పరీక్ష కేంద్రాలకు చేరుకునే విధంగా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. పరీక్ష ప్రారంభానికి 15 నిమిషాల ముందే గేట్లు క్లోజ్ చేయనున్నట్లు తెలిపారు.

ఉదయం పేపర్-1 పరీక్ష ఉదయం 9.45 గంటలు దాటిన తర్వాత, మధ్యాహ్యం 2.15 తరువాత ఎగ్జామ్ సెంటర్లలోకి ఎట్టి ప రిస్థితుల్లోనూ అనుమతించేది లేదని తెలిపారు.సెల్ ఫోన్లు, వాచీలు, ఎలక్ట్రానిక్ పరికరాలు, రిమోట్ తో కూడిన కారు తాళాలు, నిషేధిత, విలువైన వస్తువులు తీసుకురావద్దని స్పష్టం చేశారు. షూలు ధరించి రావొద్దని కేవలం చెప్పులతో మాత్రమే రావాలని, అభ్యర్థులను క్షుణ్ణంగా తనిఖీ తరువాత మాత్రమే పరీక్ష కేంద్రంలోకి అనుమతించనున్నట్లు తెలిపారు. జిల్లాలో 188 పరీక్షా కేంద్రాలలో 53, 213 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కానున్నట్లు తెలిపారు.

నల్గొండ డివిజన్‌లో 110 పరీక్ష కేంద్రాల్లో 32,117 మంది, మిర్యాలగూడ డివిజన్ లో 60 పరీక్ష కేంద్రాల్లో 16,152 మంది, దేవరకొండ డివిజన్ లో 18 పరీక్ష కేంద్రాల్లో 4,944 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కానున్నారన్నారు. పరీక్షా నిర్వహణకు 38 రూట్లు ఏర్పాటు చేయగా, రూట్ అధికారులుగా తహశీల్దార్లు, ఎంపీడీఓ లను, జిల్లా అధికారులను నియమించినట్లు తెలిపారు. పరీక్షా కేంద్రంల చీఫ్ సూపరింటెడెంట్లకు, లైజన్ అధికారులకు ఇప్పటికే శిక్షణ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. పరీక్ష కేంద్రంలో ఇన్విజిలేటర్లు సర్వీస్ కమిషన్ నిబంధనలు పాటించాలని, అభ్యర్థులు ప్రతీ సెషన్ ఎగ్జామ్ ముగిసిన తర్వాత ఓఎంఆర్ షీట్‌ను ఇన్విజిలేటర్ కు అందించి నామినల్ రోల్ పై వేలిముద్ర వేయాల్సి ఉంటుందన్నారు. అభ్యర్థి కాకుండా వేరే వ్యక్తులు హాజరైనట్లు గుర్తిస్తే క్రిమినల్ కేసు నమోదు చేసి కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News