- Advertisement -
తిప్పర్తి: నల్గొండ జిల్లా తిప్పర్తిలో గంజాయి బ్యాచ్ హల్ చల్ చేసింది. పోలీస్ స్టేషన్‌కు కూతవేటు దూరంలోనే గంజాయి మత్తులో కొందరు యువకులు వీరంగం సృష్టించారు. సంజీవరెడ్డి అనే కుటుంబంపై దాడికి పాల్పడ్డారు. అంతేకాకుండా, తిప్పర్తి జాతీయ రహదారిపై వెళ్తున్న ఆర్టీసీ బస్సు, ఒక లారీపై కూడా దాడి చేశారు. ఫోన్‌ను లారీపైకి విసిరికొట్టారు. ఈ యువకుల వీరంగంతో స్థానికులు, వాహనదారులు భయబ్రాంతులకు గురయ్యారు. గంజాయి బ్యాచ్ ఆగడాలు మితిమీరిపోతున్నాయని వాహనదారులు వాపోతున్నారు. గంజాయిని ఆరికట్టకపోతే సామాజానికి చాలా ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని వాపోతున్నారు.
- Advertisement -