Thursday, April 18, 2024

పత్తి గింజల మాటున గంజాయి స్మగ్లింగ్

- Advertisement -
- Advertisement -

Cannabis smuggling in cotton seeds load

మనతెలంగాణ/హైదరాబాద్ (శంషాబాద్): పశువుల దాణాలకు ఉపయోగించే పత్తి గింజల పొట్టు మాటున 800 కిలోల గంజాయి తరలిస్తున్న ఇద్దరు నిందితులను ఆదివారం నాడు శంషాబాద్, ఎస్‌వొటి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా సైబరాబాద్ సిపి స్టీఫెన్వ్రీంద్ర మాట్లాడుతూ ఎపిలోని ఎవొబి నుంచి హైదరాబాద్ మీదుగా ఉత్తరప్రదేశ్‌లోని బులంద షహర్‌కు గంజాయి తరలిస్తున్నట్లు ముందస్తు సమాచారం మేరకు శంషాబాద్, ఎస్‌వొటి పోలీసులు తనికీలు నిర్వహించారన్నారు. ఈక్రమంలో శంషాబాద్ సమీపంలో ఓ లారీలో పత్తి గింజల బ్యాగులలో సుమారు రూ. 2 కోట్ల విలువైన 800 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ గంజాయి తరలిస్తున్న ఐదుగురిలో ఒకరు ఒరిస్సా నలుగురు ఉత్తరప్రదేశ్ వాసులుగా పోలీసులు గుర్తించామన్నారు. ఘటనాస్థలం నుంచి పారిపోయిన మరో ముగ్గురు యూపి వాసుల కోసం గాలింపు చర్యలు చేపట్టామని, నిందితులు గంజాయిని ఆంధ్రా ఒరిస్సా బార్డర్ నుంచి హైదరాబాద్ మీదుగా ఉత్తర్ ప్రదేశ్‌లోని బులంద షహర్‌కు తరలిస్తున్నట్లు తెలిపారు.

కాగా ఎవొబిలో కేజీ గంజా రూ. 5 వేలకు కొనుగోలు చేసి యూపీలో రూ. 25 నుంచి రూ. 35 వేలకు విక్రయిస్తున్నట్లు విచారణలో తేలిందన్నారు. గంజాయి అక్రమ రవాణాపై హైదరాబాద్ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నామని, అందుకు తగినట్లుగా పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఎవొబి నుంచి హైదరాబాద్ మీదుగా ఉత్తరప్రదేశ్‌కు గంజాయిని అక్రమంగా తరలిస్తున్న ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు. నిందితుల నుంచి ఒక లారీ, రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. అరెస్ట్ చేసిన ఇద్దరు నిందితులను సోనూ సింగ్, ఖుషి మహమ్మద్‌గా గుర్తించామన్నారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నారని.. వారి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు సిపి వెల్లడించారు. భారీ ఎత్తున గంజాయి పట్టుకున్న శంషాబాద్,ఎస్‌వొటి పోలీసులకు రివార్డులు అందజేస్తామని సిపి స్టీఫెన్ రవీంద్ర తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News