Sunday, November 3, 2024

సికింద్రాబాద్‌లో కారు దగ్ధం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కారులో మంటలు చెలరేగి దగ్ధమైన సంఘటన సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు కార్యాలయం ఎదుట శుక్రవారం చోటుచేసుకుంది. బాపూజీనగర్‌కు చెందిన వ్యక్తి కారును రిపేరు చేయించుకుని వస్తుండగా కంటోన్మెంట్ కార్యాలయం వద్ద కారులో నుంచి పొగలు వస్తున్నాయి. అక్కడ విధులు నిర్వర్తిస్తున్న ట్రాఫిక్ కానిస్టేబుల్ కారును ఆపి, యజమానికి పొగలు వస్తున్న విషయం చెప్పాడు. కారు ఆపి కిందకు దిగేపోలోపే ఇంజన్ భాగం నుంచి మంటలు చెలరేగి కారు మొత్తం వ్యాపించాయి. అందులో ఉన్న వ్యక్తి కిందకు దిగడంతో నిమిషాల్లో కారు మొత్తం అగ్నికి ఆహుతైంది. సమాచారం అందుకున్న అగ్నిమాక శాఖ సిబ్బంది సంఘటన స్థలానికి వచ్చి మంటలను ఆర్పివేశారు. కారు తన కళ్ల ఎదుట కాలీబూడిద కావడంతో యజమాని కన్నీటీ పర్యంతమయ్యాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News