Sunday, May 19, 2024

రాజేంద్రనగర్‌లో కారులో చెలరేగిన మంటలు

- Advertisement -
- Advertisement -

రంగారెడ్డి: రన్నింగ్ కారులో మంటల చెలరేగి చూస్తుండగానే కాలిపోయిన సంఘటన రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లోని శివరాంపల్లిలో జరిగింది. శివరాంపల్లి శివారులో ఇన్నోవా కారు వెళ్తుండగా ముందభాగం నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే కారులో ఉన్నవారు బయటకు దిగి ఆర్పేస్తుండగా చూస్తుండగానే వామనం కాలిపోయింది. డ్రైవర్ సమాచారం మేరకు అగ్నిమాపక యంత్రాలు ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పేశాయి. వేడి ఎక్కువగా ఉండడంతో షార్ట్ సర్కూట్‌తోనే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని అగ్నిమాపక సిబ్బంది భావిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News