Sunday, July 21, 2024

ట్రాఫిక్ కానిస్టేబుల్ పై కారు డ్రైవర్ దాడి

- Advertisement -
- Advertisement -

Car driver attack on traffic constable in Bhimavaram

 

అమరావతి: భీమవరంలో ట్రాఫిక్ కానిస్టేబుల్ పై కారు డ్రైవర్ దాడికి పాల్పడ్డాడు. ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ దూసుకొస్తున్న కారును ఆపి డ్రైవర్ ను నిలదీసినందుకు కానిస్టేబుల్ దాడి చేశాడు. కానిస్టేబుల్ పై డ్రైవర్ పిడి గుద్దులు గుద్దాడు. కానిస్టేబుల్ కూడా దీన్నిప్రతిఘటించాడు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరం వీరమ్మ పార్క్ వద్ద మంగళవారం ఈ ఘటన జరిగింది. స్థానికంగా ఉన్న వారు సెల్ ఫోన్లలో వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో అప్లోడ్ చేయడంతో ఈ దృశ్యాలు వైరల్ గా మారాయి. డ్రైవర్ ను భీమవరానికి చెందిన సంతోష్ కుమార్ గా గుర్తించారు. ట్రాఫిక్ కానిస్టేబుల్ ఫిర్యాదు కేసు నమోదు చేసుకున్న పోలీసులు డ్రైవర్ ను అరెస్టు చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News