- Advertisement -
మధ్యప్రదేశ్ లోని గుణ జిల్లాలో బధౌరా పట్టణానికి సమీపాన గురువారం తెల్లవారు జామున డివైడర్‌కు కారు ఢీకొని నలుగురు మృతి చెందారు. మృతులు గోవింద్ రఘువంశీ (28) , సోను రఘువంశీ ( 35) వీరు కుష్వహా (24), హితేష్ బైరాగి (24) గా గుర్తించారు. వీరంతా రిజోడా గ్రామానికి చెందిన వారు. గుణ జిల్లా మావన్ వద్ద పెళ్లికి వెళ్లి తిరిగి కారులో రిజోడా గ్రామానికి వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని మ్యానా పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జి గోపాల్ చౌబే తెలియజేశారు. రోడ్డుపై ఉన్న జంతువును తప్పించ బోయి డివైడర్‌కు ఢీకొని ఉండవచ్చని భావిస్తున్నారు. గాయపడిన వారిని జిల్లా ఆస్పత్రిలో చేర్చారు. వీరిలో ఒకరి పరిస్థితి ఆందోళన కరంగా ఉండడంతో భోపాల్ ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
- Advertisement -