Saturday, February 4, 2023

ట్రక్కును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి

- Advertisement -

జైపూర్: రాజస్థాన్ హనుమాన్‌గఢ్ జిల్లాలో శనివారం అర్థరాత్రి దాటాక ఇటుకలతో వెళ్తున్న ట్రక్కును కారు ఢీకొని ఐదుగురు మృతి చెందారు. మరొకరు గాయపడ్డారు. మృతులు రాజూ మేఘ్వాయి, నరేష్ కుమార్, దనరామ్, బబ్లు, మురళీశర్మగా గుర్తించారు. రావత్సర్‌సర్దార్‌షహర్ జాతీయ రహదారిపై బిస్రాసర్ గ్రామ సమీపాన ఈ ప్రమాదం జరిగింది. ముగ్గురు అక్కడికక్కడే చనిపోగా, ఇద్దరు స్థానిక ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు.

గాయపడిన వ్యక్తిని బికనీర్ ఆస్పత్రికి తరలించారు. పాల్లు నుంచి సర్దార్‌షహర్‌కు ట్రక్కు వెళ్తుండగా, బిస్రాసర్ గ్రామం నుంచి జాతీయ రహదారిపై కారు వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని పాల్లు స్టేషన్ హౌస్ ఆఫీసర్ గోపీరామ్ చెప్పారు. ట్రక్కు డ్రైవర్ పరారీలో ఉన్నాడు. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest Articles