Thursday, November 7, 2024

కులగణనపై నేడు కీలక భేటీ

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్:గాంధీభవన్‌లో నేడు ఉదయం 10.30 గంటలకు కులగణనపై సమావేశం జరుగనుం ది. ఈ కార్యక్రమానికి సిఎం రేవంత్ రెడ్డి, ఏఐసిసి ఇంచార్జ్ ప్రధాన కార్యదర్శి దీపాదాస్ మున్షీ, డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్కలు పాల్గొంటారు. ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఆలోచన, ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ కులగణనకు సంబంధించి దేశ వ్యాప్తంగా హర్షం వ్యక్తం అవుతోంది.

ఈ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం నవంబర్ 4వ తేదీ నుంచి రాష్ట్రంలో కులగణన ప్రక్రియ చేపట్టాలని అందుకోసం 80 వేల మంది ఉద్యోగులను కేటాయించి తగిన విధంగా ముందుకు పోతోంది. ఈ విషయంలో లోతుగా చర్చించి పార్టీ పరంగా దీనిపై ఒక కార్యాచరణ తీసుకోవాలని నిర్ణయించింది. దీంతో పార్టీ ఆధ్వర్యంలో టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన నేడు ఉదయం 10.30 గం టలకు మంత్రులు, సలహాదారులు, ఎంపిలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, డిసిసి అధ్యక్షులు, విప్‌లు, కార్పొరేషన్ చైర్మన్‌లతో ఈ సమావేశం ఏర్పాటు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News