Saturday, December 14, 2024

బిసిలకు దక్కాల్సిన రిజర్వేషన్లు అందించడానికే కులగణన

- Advertisement -
- Advertisement -

ఇది చరిత్రాత్మకం : సిఎం రేవంత్

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో కులగణనను ప్రభుత్వం బాధ్యతగా తీసుకుందని సిఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు సామాన్యుల నుం చి సూచనలు తీసుకోవడానికి రాహుల్‌గాంధీ నేరు గా రాష్ట్రానికి రావడం గొప్ప విషయమన్నారు. సా మాజిక బాధ్యత, సమాన అవకాశాలు ఇవ్వాలన్న ఆలోచన తో రాహుల్ గాంధీ ఇక్కడకు వచ్చారని, మాటలు కాదు, చేతలతో చూపాలన్నది రాహుల్ గాంధీ ఆలోచన అని ఆయన వ్యాఖ్యానించారు. కులగణన విషయంలో రాహుల్‌కు ఇచ్చిన మాట నెరవేర్చడమే త మ కర్తవ్యమని సిఎం పేర్కొన్నారు. కులగణన మా టల్లో కాదు చేతల్లో చూపాలన్నదే ఆయన ఆలోచన అని సిఎం తెలిపారు. ఈ నిర్ణయం తీసుకోవాలంటే గుండె ధైర్యం కావాలన్నారు. సామాజిక బాధ్యత, సమాన అవకాశాలు ఇవ్వాలన్న ఆలోచనతోనే ప్ర భుత్వం ఈ నిర్ణయం తీసుకుందని సిఎం రేవంత్ పేర్కొన్నారు. బిసిలకు అందాల్సిన రిజర్వేషన్లు కులగణనతో అందిస్తామని సిఎం స్పష్టం చేశారు. 2025లో చేపట్టబోయే జనగణనలో కులగణనను కూడా పరిగణలోకి తీసుకోవాలని సిఎం రేవంత్‌రెడ్డి సూచించారు.

భారత్ జోడో యాత్ర ఎంతోమందిని కదిలించింది: సిఎం

భారత్ జోడో యాత్ర ఎంతోమందిని కదిలించిందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. యాత్రలో భాగంగా రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం కులగణన చేస్తున్నామని, ఇందిరాగాంధీ ‘గరీబ్ హఠావో’ అనే నినాదంతో చరిత్రలో నిలిచారని సిఎం గుర్తుచేశారు. ప్రస్తు తం తెలంగాణలో కులగణన చారిత్రాత్మకం కాబోతోందని, రాహుల్ గాంధీ నేతలకు మా ట ఇస్తే అది శాసనమని రేవంత్ చెప్పారు. విద్య, వైద్యం, ఉద్యోగం, సామాజిక న్యాయం ప్రజలకు అందించాలని ముందుకు వేశారని, రాహుల్ ఇచ్చిన మాటను నెరవేర్చడమే మన కర్తవ్యమనితెలిపారు.

ఇటీవల నిర్వహించిన గ్రూప్ 1 పరీక్షలో 31,383 మంది మెయిన్స్‌కు ఎంపికయ్యారని, ఇందులో ఓసీలు- 3,076 (9.8 శాతం), ఈడబ్ల్యూఎస్- 2,774 (8.8 శాతం), ఓబిసిలు-17,921 (57.11 శాతం), ఎస్సీలు-4,828 (15.3 శాతం), ఎస్టీలు -2,783 (8.8 శాతం) అని సిఎంతెలిపారు. మనది రైజింగ్ తెలంగాణ అని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. దేశానికి రాహుల్ గాంధీ ఇచ్చిన మాటను అమలు చేయడం మన కర్తవ్యమని రేవంత్ రెడ్డి తెలిపారు. కులగణనను పూర్తి చేసి బిసిలకు న్యాయంగా అందాల్సిన రిజర్వేషన్లు అందిస్తామని సిఎం రేవంత్ రెడ్డి ఉద్ఘాటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News