Friday, May 3, 2024

సిబిడిటి ఛైర్మన్ నితిన్‌గుప్తా పదవీకాలం మరో 9 నెలలు పొడిగింపు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : సెంట్రల్ బోర్డు ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (సిబిడిటి) ఛైర్‌పర్శన్ నితిన్‌గుప్తా పదవీకాలాన్ని కాంట్రాక్ట్ ప్రాతిపదికపై కేంద్ర ప్రభుత్వం మరో తొమ్మిది నెలలు పొడిగించింది. శనివారం నాటికి నితిన్‌గుప్తా రిటైర్ కావలసి ఉంది. ఇంకమ్ టాక్స్ డిపార్టుమెంట్‌లో 1986 బ్యాచ్ ఇండియన్ రెవెన్యూ సర్వీస్ (ఐఆర్‌ఎస్) ఆఫీసర్ అయిన నితిన్‌గుప్తా (60) గత ఏడాది జూన్‌లో సిబిడిటి ఛైర్‌పర్శన్‌గా నియామకమయ్యారు. అయితే కాంట్రాక్ట్ ప్రాతిపదికన తిరిగి సిబిడిటి ఛైర్‌పర్శన్‌గా గుప్తాను నియమించడానికి కేబినెట్ అపాయింట్‌మెంట్ కమిటీ ఆమోదించిందని ప్రభుత్వ ఉత్తర్వు పేర్కొంది.అక్టోబర్ 1 నుంచి వచ్చే ఏడాది జూన్ వరకు ఈ పదవిలో ఉంటారని వివరించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News