Monday, June 5, 2023

సిబిఐటి వద్ద రోడ్డు ప్రమాదం: ముగ్గురు విద్యార్థులు మృతి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా నార్సింగ్‌లోని సిబిఐటి వద్ద శుక్రవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. లారీని కారు వెనుక నుంచి ఢీకొట్టడంతో ముగ్గురు విద్యార్థులు ఘటనా స్థలంలోనే చనిపోయారు. ఈ ప్రమాదంలో మరో ఐదుగురు విద్యార్థులు తీవ్రంగా గాయపడినట్టు సమాచారం. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. స్థానికులు కారులో ఇరుక్కుపోయిన మృతదేహాలను బయటకు తీశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతులు నిజాంపేట వాసులుగా గుర్తించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News