Sunday, December 15, 2024

పత్తి కొనుగోళ్లకు తొలగిన ప్రతిష్టంభన

- Advertisement -
- Advertisement -

కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి జోక్యంతో సిసిఐ యథావిధిగా కొనుగోలు
మన తెలంగాణ/హైదరాబాద్‌ః తెలంగాణ రాష్ట్రంలో పత్తికొనుగోళ్లకు లైన్ క్లియర్ అయ్యింది. ఇప్పటి వరకు కొనసాగిన ప్రతిష్టంభన తొలగిపోయింది. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి, రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కిషన్‌రెడ్డి జోక్యం చేసుకోవడంతో కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సిసిఐ)ని పత్తి కొనుగోలు చేయాలని మంగళవారం ఆదేశించారు. గత కొన్ని రోజులుగా తెలంగాణలో పత్తి కొనుగోళ్లు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. కేంద్ర జౌళి శాఖ మంత్రితో కిషన్‌రెడ్డి మాట్లాడి పరిస్థితిని వివరించడంతో పత్తి కొనుగోళ్లకు అవకాశం కలిగింది. దీంతో రాష్ట్రంలో పత్తి కొనుగోళ్లు యాథావిధిగా కొనసాగనున్నాయి. పత్తి కొనుగోళ్లలో గత ఏడాది సీసీఐ అనుసరించిన నియమ నిబంధనలనే ఈ ఏడాది కూడా పాటించనుంది.

ఇక కొనుగోలు కేంద్రాలను సైతం గత ఏడాది ఏర్పాటు చేసిన సంఖ్యకు తక్కువ కాకుండా ఈసారి ఎక్కువగా ఏర్పాటు చేయనుంది. రాష్ట్రంలో పండిన పత్తిని కనీస మద్దతు ధర క్వింటాల్‌కు రూ.7,350 చొప్పున సీసీఐ కొనుగోలు చేయనుంది. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ పత్తి రైతులెవరూ ఆందోళన చెందవద్దని, ఈ ఏడాది రాష్ట్రంలో పండిన పత్తిని కనీస మద్దతు ధరకు కొనుగోలు చేసేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. దళారులకు తక్కువ ధరకు అమ్ముకోవద్దని రైతులకు సూచించారు. రాష్ట్రంలో పత్తి కొనుగోళ్లలో నెలకొన్న ప్రతిష్టంభన తొలగిపోవడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News