Sunday, December 15, 2024

2024లో అత్యధిక పన్ను చెల్లించిన సెలబ్రిటీలు వీరే

- Advertisement -
- Advertisement -

202324 ఆర్థిక సంవత్సరానికి గాను అత్యధిక పన్ను చెల్లించిన సెలబ్రిటీల్లో బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ అగ్ర స్థానంలో నిలిచారు. నిరుడు ‘పఠాన్’, ‘జవాన్’ వంటివి వరుసగా వెయ్యి కోట్ల సినిమాలతో కింగ్ ఖాన్ అలరించారు. దీనితో ఆయన రూ. 92 కోట్ల పన్ను రూపంలో ప్రభుత్వానికి చెల్లించారు. ఆయన తదుపరి స్థానంలో కోలీవుడ్ స్టార్ దళపతి విజయ్ ఉన్నారు. ఆయన నటించిన ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’ (జిఒఎటి గోట్) చిత్రం రూ. 600 కోట్లకు పైగా కొల్లగొట్టిన విషయం విదితమే.

విజయ్ రూ. 80 కోట్లు పన్ను చెల్లించారు. అదే విధంగా బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ రూ. 75 కోట్లు పన్ను కట్టారు. వారి తరువాతి స్థానాల్లో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ (రూ. 71 కోట్లు), టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ (రూ. 66 కోట్లు) ఉన్నారు. ఇక మహిళా సెలబ్రిటీల్లో కరీనా కపూర్ రూ. 10 కోట్లతో టాప్‌లో ఉన్నారు. స్టార్లు చేసిన పన్ను చెల్లింపుల ఆధారంగా ఫార్చూన్ ఇండియా ఈ గణాంకాలను వెల్లడించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News