Monday, April 22, 2024

రోడ్ల నిర్మాణానికి కేంద్రం రూ. 850 కోట్లు మంజూరు

- Advertisement -
- Advertisement -

ఎంపి బండి సంజయ్ ప్రతిపాదనలకు మోడీ సర్కార్ ఆమోదం
కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో రూ.107 కోట్లు విడుదల
ప్రధాని మోడీ, కేంద్రమంత్రి గడ్కరీకి ధన్యవాదాలు తెలిపిన బండి

మన తెలంగాణ/హైదరాబాద్: కేంద్ర రహదారుల మౌలిక సదుపాయాల నిధి కింద తెలంగాణలో రోడ్ల నిర్మాణానికి రూ.850 కోట్లను కేంద్రం ఆమోదం తెలిపింది. రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు సంబంధించి మొత్తం 31 రోడ్ల నిర్మాణ పనులకు నిధులు మంజూరు చేసింది. శుక్రవారం కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ కార్యదర్శి కమల్ ప్రకాశ్ ఉత్తర్వులు జారీ చేశారు. కరీంనగర్ ఎంపి బండి సంజయ్ కుమార్ ప్రతిపాదనల మేరకు కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో 4 రహదారుల నిర్మాణానికి రూ.107 కోట్లను విడుదల చేసింది. కరీంనగర్, జగిత్యాల, సిద్దిపేట జిల్లాల పరిధిలో మొత్తం 57 కిలోమీటర్ల పరిధిలో రోడ్ల నిర్మాణానికి నిధుల మంజూరు చేసింది.

వాటిలో గన్నేరువరం నుండి బెజ్జంకి వరకు 23 కి.మీల పరిధిలోని సింగిల్ రోడ్డును డబుల్ లేన్ రోడ్డుగా విస్తరిస్తూ నిర్మాణం చేపట్టనున్నారు. ఇందుకోసం రూ.32 కోట్లను విడుదల చేశారు. అట్లాగే అంతక్కపేట నుండి కొత్త కొండ వరకు 10 కి.మీల మేరకు రోడ్డు నిర్మాణానికి రూ.25 కోట్లు విడుదల చేశారు. మల్యాల నుండి నూకపల్లి, రామన్నపేట గ్రామాల మీదుగా కాచపల్లి వరకు మొత్తం 11.7 కి.మీల రోడ్డు నిర్మాణానికి రూ.25 కోట్లు మంజూరు చేశారు. దీంతోపాటు హుస్నాబాద్ నుండి రామవరం వరకు మొత్తం 11.5 కి.మీల రోడ్డు నిర్మాణానికి రూ.25 కోట్లను విడుదల చేశారు.

మరోవైపు కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో రోడ్ల నిర్మాణానికి కేంద్రం సీఆర్‌ఐఎఫ్ కింద రూ.107 కోట్లను విడుదల చేయడంపట్ల బండి సంజయ్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు. ప్రధాన మంత్రి నరేంద్రమోడీ, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. దీంతోపాటు సహకరించిన రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి అభినందనలు తెలిపారు. రాష్ట్రాభివృద్దికి రోడ్ల నిర్మాణం విషయంలో గత ప్రభుత్వం కేంద్రానికి సహకరించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తాము పంపిన ప్రతిపాదనలకు పట్టించుకోలేదని, గత పాలకులు సహకరించి ఉంటే రోడ్ల నిర్మాణానికి మరిన్ని నిధులు వచ్చేవన్నారు. రాజకీయాలను పక్కనపెట్టి రాష్ట్రాభివృద్ధి విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేస్తే భారీ నిధులు వస్తాయనడానికి ఇదే నిదర్శనమన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News